పోలీసులు రౌడీ షీటర్లను కొడితే తప్పేంటి ? తెనాలి ఘటనపై హోంమంత్రి కామెంట్స్..!
ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో తాజాగా పోలీసులపై గంజాయి బ్యాచ్ దాడికి దిగడం, అనంతరం వారిని పట్టుకుని రోడ్డుపైనే పోలీసులు లాఠీలతో అరికాళ్లపై కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ చర్యను పోలీసు వర్గాలు ఇప్పటికే సమర్దించుకున్నాయి. పోలీసులపై గంజాయి బ్యాచ్ దాడి చేయడం వల్లే తాము వాళ్లను పట్టుకుని శిక్షించినట్లు చెప్పుకొస్తున్నారు. దీనిపై విమర్శలు వస్తున్న తరుణంలో ఇవాళ హోంమంత్రి వంగలపూడి అనిత దీనిపై స్పందించారు.
తెనాలిలో రౌడీ షీటర్లపై పోలీసుల బహిరంగ దాడిపై హోంమంత్రి అనిత స్పందించారు. పోలీసులు ఇలా రౌడీ షీటర్లపై రోడ్డుపైనే దాడికి దిగిన ఘటనపై మీడియా ప్రశ్నకు సమాధానం ఇచ్చిన అనిత.. దీన్ని సమర్ధించుకున్నారు. పోలీసులు యాక్షన్ తీసుకోలేదంటారని, ఒక స్టెప్ ఫార్వాడ్ వేస్తే ఈ రకంగా విమర్శిస్తారని అనిత చెప్పుకొచ్చారు. పోలీసుల్ని కొంత పనిచేసుకోనివ్వాలని హోంమంత్రి తెలిపారు.

తెనాలిలో పోలీసులపై రౌడీ షీటర్స్ దాడికి ప్రయత్నించారని, పోలీసుల్ని కొట్టినందుకే వాళ్లు అలా చేసారని హోంమంత్రి అనిత తెలిపారు. వాళ్లందరూ రౌడీ షీటర్స్, గంజాయి బ్యాచ్ అని హోంమంత్రి వెల్లడించారు. దీంతో అనిత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోలీసుల్ని కొట్టిన వాళ్లను చట్టప్రకారం శిక్షించే అవకాశం ఉన్న ఇలా రోడ్డుపై వాళ్లను లాఠీలతో అందరూ చూస్తుండగా కొట్టడం, దాన్ని హోంమంత్రి సమర్ధించుకోవడం చర్చనీయాంశమవుతోంది. ఇలాంటి చర్యలను సమర్ధిస్తే పోలీసులు మరింత రెచ్చిపోతారన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications