ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!!

ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే తెలంగాణలో ఫలితాలను ప్రకటించారు. దీంతో, ఏపీలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్ధుల్లో ఫలితాల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తయింది. అనంతర ప్రక్రియ కూడా ఓ కొలిక్కి వచ్చింది. దీంతో ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాసెస్ ఈనెల 16వ తేదీ నాటికి పూర్తి చేయనున్నారు. దీంతో.. ఫలితాల వెల్లడి ముహూర్తం పైన ప్రతిపాదనలు సిద్దం చేసారు.

ఏపీలో ఇంటర్ ఫలితాల వెల్లడికి తేదీలు ఖరారు చేసారు. ఈ నెల 18 లేదా 19 తేదీల్లో ఫలితాల ను విడుదల చేసేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. మూల్యాంకనం ఇప్పటికే పూర్తి కాగా, అనంతర ప్రక్రియ కూడా ఓ కొలిక్కి వచ్చింది. దీంతో ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌లో ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రకారం 1359 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు 'అదనపు సబ్జెక్టు' ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నారు. ఈ సబ్జెక్టు మార్కులను ఇంటర్‌ బోర్డు విడిగా చూపించ నుంది. విద్యార్థులకు ఇచ్చే రెగ్యులర్‌ మార్కుల మెమోలో ఈ మార్కులు కలపరు. ఇంటర్మీడి యట్‌ విద్యలో చేపట్టిన సంస్కరణల్లో భాగంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి 'అదనపు సబ్జెక్టు' అనే ఆప్షన్‌ వచ్చింది.

ap-intermediate-board-planning-to-release-results-in-next-four-days-as-discussions-with-the-govt

ఈ నెల 18 లేదా 19న ఫలితాల వెల్లడి

కాగా, కావాలనుకుంటే ఎంపీసీ వి ద్యార్థులు బయాలజీని, బైపీసీ విద్యార్థులు గణితంను ఎంపిక చేసుకొని, రెగ్యులర్‌ సబ్జెక్టులతో పాటు దీన్నీ చదువుకోవచ్చు. దీంతో రాష్ట్రవ్యాప్తం గా 1359 మంది విద్యార్థు లు ఈ అదనపు సబ్జెక్టు ఎంపిక చేసుకున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మొదలైన ఇంటర్మీడి యట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 23వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రధమ సంవత్సరంలో తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా పరీక్షల నిర్వహణకు నెల సమయం పట్టింది. దీంతో, మూల్యాంకనం పూర్తి చేయటం కొంత ఆలస్యమైంది. ఇక మూల్యాంకనం పూర్తి చేయటం తో.. ఈ నెల 18 లేదా 19వ తేదీల్లో ఇంటర్ పరీక్ష ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించారు. 18వ తేదీన విడుదలకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+