రేపే ఇంటర్ ఫలితాలు, ఈ సారి కొత్తగా - ఇలా తెలుసుకోండి..!!
ఏపీలో ఇంటర్ ఫలితాలకు ముమూర్తం ఫిక్స్ అయింది. రేపు (శనివారం) 12వ తేదీన ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని ఏపీ ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది. రేపు ఉదయం 11 గంటలకు మంత్రి లోకేష్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ సారి ఫలితాలు ఇంటర్ వెబ్ సైట్ తో పాటుగా వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009కు..హాయ్ అని మెసేజ్ పంపి ఫలితాలు తెలుసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది.
రేపే ఫలితాలు
ఇంటర్ - పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్ధులు ఫలితాల కోసం ఉత్కంఠగా చూస్తున్నారు. ఏపీలో మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 25 కేంద్రాల్లో మార్చి 17 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించగా మొత్తం నాలుగు విడుతల్లో పూర్తి చేశారు. ఇక విద్యార్ధుల మార్కుల కంప్యూటరీకరణ ప్రాసెస్ కూడా పూర్తయింది. దీంతో, రేపు (శనివారం) 17న ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో ఇంటర్మీ డియట్ పరీక్షల ఫలితాలను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్లు తెలిపింది.

ఎలా తెలుసుకోవాలి
ఏపీలో ఇంటర్ ఫలితాల కోసం ఈ సంవత్సరం టెన్త్, ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల చేసినట్టుగానే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫలితాలు కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సారి ఫలితాలను వాట్సాప్ నంబర్ 9552300009 లేదా BIEAP అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తు న్నారు. తెలంగాణలో ఇంటర్ ఫలితాల కోసం tsbie.cgg.gov.in, results.cgg.gov.in వెబ్‌సైట్లలో సంప్రదించాలని ఇంటర్ బోర్డు సూచించింది. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్థుల సౌలభ్యం కోసం మార్కుల జాబితాను వివిధ మార్గాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు వివరించింది. దీంతో, విద్యార్ధులకు ఫలితాలు వెల్లడించిన వెంటనే తెలుసుకునే వెసులుబాటు కలగనుంది.












Click it and Unblock the Notifications