సెప్టెంబర్ 15 నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష్లలు: వారికిదే చివరి అవకాశం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు-2021 సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యా మండలి మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.
ఈ ఏడాది మార్చిలోనే జరగాల్సిన పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడుతూ చివరకు రద్దైన విషయం తెలిసిందే. ఉన్నత చదువులకు వీలుగా హైపవర్ కమిటీ సిఫార్సులను అనుసరించి ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు ఇటీవల ఇ:టర్ బోర్డు ఫలితాలను ప్రకటించింది. ఆ విద్యార్థుల టెన్త్, ఇంటర్ ఫస్టియర్ మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. అయితే, ఫస్టియర్ విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.

సెకండియర్ ఫలితాల్లో వచ్చిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు అడ్వాన్స్‌డ్
సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు. ఫస్టియర్ విద్యార్థులు తప్పనిసరిగా ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజును ఆగస్టు 17 లోపు చెల్లించాలని పేర్కొంది. జనరల్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులంతా ఈ గడువులోగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
పబ్లిక్ పరీక్షలకు ఇంతకుముందు ఫీజు చెల్లించిన ఫస్టియర్ విద్యార్థులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. బెటర్మెంట్ కోసం ఈ పరీక్షలకు హాజరవుదామనుకునే సెకండియర్ విద్యార్థులు కూడా ఫీజు మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదు. వారికి ఇంతకుముందు వచ్చిన మార్కులు, ఇప్పుడు వచ్చిన మార్కుల్లో ఏవి ఎక్కువగా ఉంటే వాటినే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.
Recommended Video
కాగా, 2019లో ఇంటర్ సెకండియర్ విధ్యార్థులకు బెటర్మెంట్ మార్కుల కోసం ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలే చివరి అవకాశం. మరోసారి పరీక్షల తేదీలను పొడిగించలేమని బోర్డ్ పేర్కొంది. ఇక అటెండెన్స్ మినహాయింపుతో ప్రైవేటుగా పరీక్షలకు హాజరయ్యే హ్యూమానిటీస్ అభ్యర్థులు మాత్రం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏపీలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications