ఎపి బంద్: ఎమ్మెల్యే గుండు కొట్టించుకుని నిరసన, బోండా ఉమా ఫైర్
Recommended Video

అమరావతి: కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా గురువారం ఆంధ్రప్రదేశ్ బంద్‌లో దాదాపు అన్ని పక్షాలు పాల్గొన్నాయి. బిజెపి మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆందోళనలో పాలు పంచుకున్నారు.
రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, కొల్లు రవీంద్రలతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఆందోళనకు దిగారు. కేంద్రం ఎపికి అన్యాయం చేసిందంటూ వారు గళమెత్తారు.

బోడె ప్రసాద్ వినూత్న నిరససన
పెనమలూరు శాసనసభ్యుడుబోడె ప్రసాద్ వినూత్న నిరసన చేపట్టారు. ఉయ్యూరు సెంటర్‌లో కూర్చుని ఆయనయ గుండు గీయించుకుని నిరసన తెలిపారు. ఎపికి న్యాయం చేయాలంటూ గత ఐదు రోజులుగా టిడిపి ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లోనూ నిరసన తెలియజేస్తున్నా కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.

ఆ రోజు కాంగ్రెసు అలా చేస్తే...
అప్పటి కాంగ్రెసు ప్రభుత్వం రాష్ట్రాన్ని హేతురహితంగా విభజించి ఎపి ప్రజలు నిలువ నీడ లేకుండా కట్టుబట్టలతో బయటకు గెంటేసిందని, ఇప్పుడు ఎన్జీఎ ప్రభుత్వం ఎపికి రావాల్సిన నిధులు విడుదల చేయకుండా, విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని బోడె ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు

కేంద్రం ఆంధ్రులను మోసం చేసింది
ఐదు కోట్ల మంది ఆంధ్రులను కేంద్రం మోసం చేసిందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు విమర్శించారు. బంద్‌లో భాగంగా ఆయన ఆధ్వర్వంలో విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్దక ఆందోళనకు దిగారు. ఎపికి న్యాయం చేస్తారని చూశామని, చివరి బడ్జెట్‌లో కూడా ఎపికి నిదులు కేటాయించలేదని, ఇది అత్యంత దారుణమైన విషయమని ఆయన అన్నారు.

ఎంపీలు పోరాటం చేస్తున్నా కూడా
లోకసభలో తమ పార్టీ ఎంపీలు పోరాటం చేస్తున్నా కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయకపోవడం బాధ కలిగించిందని బొండా ఉమా అన్నారు ఇప్పటి వరకు తాము సానుకూల వైఖరితో ఎదురు చూశామని, కేంద్ర దిగి వచ్చే వరకు వివిధ రూపాల్లో పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications