వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఏపీ: ఇన్వెస్ట్ ఇండియా వెల్లడి

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మరోసారి అగ్రస్థానానికి ఎగబాకింది. ఇదివరకు తెలంగాణతో పాటు అగ్రస్థానాన్ని పంచుకున్న ఏపీ..రెండేళ్ల తరువాత మరోసారి టాప్ ప్లేస్‌ను అందుకుంది. పెట్టబడులు పెట్టడానికి ఏపీ అత్యంత అనువైనదని ఇన్వెస్ట్ ఇండియా వెల్లడించింది. 2018 తరువాత ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానాన్ని అందుకోవడం ఇది రెండోసారి. ఇదివరకు తెలంగాణతో కలిసి అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది.

ఉత్తరాంధ్ర నడిబొడ్డున చంద్రబాబు పర్యటన: అమరావతికే జై కొడతారా? విశాఖపై వైఖరేంటీ? ఉత్తరాంధ్ర నడిబొడ్డున చంద్రబాబు పర్యటన: అమరావతికే జై కొడతారా? విశాఖపై వైఖరేంటీ?

పరిగణనలోకి తీసుకున్న అంశాలివే..

రాష్ట్రంలో క్రియాశీలకంగా ఉన్న ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్), లాజిస్టిక్స్, పారిశ్రామిక ఉత్పత్తులను తరలించడానికి అనువైన రవాణా సౌకర్యాలు, పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి భూములు అందుబాటులో ఉండటం, పారిశ్రామిక ప్రాంతాలతో పాటు వాటికి కల్పించిన మౌలిక సదుపాయాలు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే పారిశ్రామిక విధానం.. ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఇన్వెస్ట్ ఇండియా ఏపీని పెట్టుబడులను పెట్టడానికి అత్యంత అనువైన రాష్ట్రంగా గుర్తించింది. మొదటి ర్యాంకును కేటాయించింది.

29 క్రియాశీలక ఆర్థిక మండళ్లు..

29 క్రియాశీలక ఆర్థిక మండళ్లు..

రాష్ట్రంలో శ్రీసిటీ వంటి 29 ప్రత్యేక ఆర్థిక మండళ్లు క్రియాశీలకంగా ఉన్నాయని ఇన్వెస్ట్ ఇండియా పేర్కొంది. వాటిల్లో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం అనేక రాయితీలను కల్పిస్తోందని వెల్లడించింది. దీనికోసం ఏపీఐఐసీ ప్రత్యేకంగా ప్రభుత్వ ఖాళీ స్థలాలతో కూడిన ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసిందని, దీని ద్వారా పారిశ్రామికవేత్తలకు భూములను కేటాయిస్తోందని స్పష్టం చేసింది.

 ఆరు విమానాశ్రయాలు.. ఆరు ఓడరేవులు..

ఆరు విమానాశ్రయాలు.. ఆరు ఓడరేవులు..


ఏపీలో మొత్తం ఆరు విమానాశ్రయాలు ఉన్నాయని, వాటిల్లో మూడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును పొందినట్లు ఇన్వెస్ట్ ఇండియా పేర్కొంది. గన్నవరం, తిరుపతి, విశాఖపట్నం విమానాశ్రయాలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్నట్లు వెల్లడించింది. రాజమహేంద్రవరం, కడప, పుట్టపర్తిల్లో విమానాశ్రయాలు డొమెస్టిక్‌గా వినియోగిస్తోందని పేర్కొంది. విశాఖపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం, కాకినాడ ఓడరేవులతో పాటు దేశంలోనే అతి పొడవైన సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉందని ఇన్వెస్ట్ ఇండియా వెల్లడించింది.

English summary
Andhra Pradesh ranks No. 1 in Ease Of Doing Business in India. Strategic location, availability of resources, conducive business ecosystem, and liberal Government policies make it an investor-friendly state. Andhra Pradesh had Sri City Special Economic Zone that houses 150 companies from 27 countries, is a key example of well-planned infrastructure at a strategic location near Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X