ఏపీ మద్యం కేసులో బిగ్ టర్న్..! సుప్రీంకోర్ట్ కీలక ఆదేశాలు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్నట్లు ఆరోపిస్తున్న మద్యం స్కాంలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు కీలక నిందితులకు గతంలో విజయవాడ ఏసీబీ కోర్టు ఆటోమేటిక్ బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు దాన్ని పక్కనబెట్టేసింది. అంతే కాదు వీరిని లొంగి పోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ దీనిపై సుప్రీంకోర్టు మరో నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో గత వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ సిట్ విభాగం అప్పటి సీఎం జగన్ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గా ఉన్న బాలాజీ గోవిందప్పను ఈ కేసులో అరెస్టు చేసింది. వీళ్లు మద్యం తయారీ సంస్థల ద్వారా లభించిన ముడుపుల్ని వైసీపీ పెద్దలకు చేర్చారని సిట్ ఆరోపిస్తోంది. ఈ కేసులో వీళ్లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన తర్వాత వీరు దాఖలు చేసుకున్న డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు ఆమోదించింది. దీంతో ఈ ముగ్గురూ జైలు నుంచి విడుదలయ్యారు.

అయితే తాజాగా ప్రభుత్వం ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. వీరి డిఫాల్ట్ బెయిల్స్ రద్దు చేయడంతో పాటు ఈ నెల 26 లోపు లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇవాళ ఈ ముగ్గురు సిట్ ముందు లొంగిపోవాల్సి ఉంది. కానీ వీరు హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. వీరు దాఖలు చేసుుకున్న పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు లొంగిపోవాల్సిన అవసరం లేకుండా ఊరటనిచ్చింది.

మద్యం కేసు నిందితులైన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను సిట్ ముందు లొంగిపోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని సిట్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే నిందితుల తరఫు న్యాయవాదులు కూడా రీజాయిండర్ దాఖలు చేసేందుకు ఐదు రోజుల గడువు కోరారు. దీంతో డిసెంబర్ 15కు తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications