ఏపీ మద్యం కుంభకోణం.. కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి అరెస్ట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తాజాగా అత్యంత కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గర కాపు కాసిన సిట్ పోలీసులు రాజ్ కసిరెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు ఆయన మూడుసార్లు సిట్ నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకు హాజరు కాలేదు .ఈ క్రమంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు
రేపు విచారణకు వస్తానంటూ రాజు కసిరెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఆడియో విడుదల చేశారు. అయినప్పటికీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఏపీ సిట్ పోలీసులు రాజ్ కసిరెడ్డి ని హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి ఆయన నేరుగా హైదరాబాద్ కు రాగా పోలీసులు పక్కా సమాచారంతో ఆయనను అరెస్టు చేశారు.

విచారణకు హాజరవుతానని ఆడియో.. ఆపై అరెస్ట్
పోలీసులు రాజ్ కసిరెడ్డి ని నేడు రాత్రి విజయవాడకు తీసుకువస్తారు. ఇక రాజ్ కసిరెడ్డి కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అతని బెయిల్ పిటిషన్ పైన విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో సిట్ విచారణకు తాను హాజరవుతానని ఒక ఆడియో విడుదల చేశారు రాజ్ కసిరెడ్డి. ఆయన ఆడియో విడుదల చేసిన కొద్దిసేపటికే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
వైసిపి ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం
రేపు ఆయన విచారణకు వస్తాడో రాడో అన్న అనుమానంతో అదుపులోకి తీసుకున్నట్టుగా సిట్ అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉంటే గతంలో వైసిపి ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగినట్టు గుర్తించిన ఏపీ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. అప్పట్లో నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరలకు విక్రయించడం ద్వారా భారీగా డబ్బులు వెనకేసుకున్నట్టు వైసిపి ప్రభుత్వ పెద్దలపైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.
మిధున్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు
సిఐడి సిట్ అధికారులు ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ని సుదీర్ఘంగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మద్యం కుంభకోణం ఎలా జరిగింది? ఎలా డబ్బులు చేతులు మారాయి? దీని వెనుక కుట్రలో ఎవరెవరు ఉన్నారు? అనే అంశాల మీద మిథున్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు.
సాయిరెడ్డి ఇంట్లో జరిగిన చర్చలపై అధికారుల ఆరా
గత వైసిపి ప్రభుత్వం లో ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి ఇంట్లో మద్యం కుంభకోణానికి సంబంధించి జరిగిన చర్చల వివరాలను కూడా మిథున్ రెడ్డిని అధికారులు ఆరా తీశారు. ఇక తాజాగా ఈ కేసులో రాజ్ కసిరెడ్డి ని అరెస్ట్ చేయడంతో కేసులో ముందు ముందు ఏం జరగబోతుందో అన్నది ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications