రామ్‌గోపాల్‌ వర్మకు షాక్: డబ్బుల కోసం ఇంత దిగజారాలా, రియల్ లైఫ్‌లోకి రా: ఆది

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఆంద్రప్రవేశ్ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి నిప్పులు చెరిగారు. తమ ప్రాంతాన్ని కించపరిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

'కడప' వెబ్ సీరీస్ సిరిస్‌పై మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందించారు. ఇటీవల రామ్ గోపాల్‌వర్మ కడప వెబ్ సీరీస్‌‌ను విడుదల చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.

అయితే కడప జిల్లాకు చెందిన పలు ప్రజా సంఘాలు విమర్శలు గుప్పించారు. రామ్ గోపాల్ వర్మ తీరుపై విరుచుకుపడ్డారు. రామ్ గోపాల్ వర్మ కడప వెబ్ సీరీస్ తీరుపై తాజాగా మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందించారు.

 డబ్బుకోసం దిగరజారాలా

డబ్బుకోసం దిగరజారాలా

డబ్బు కోసం ఇంతలా దిగజారాలా అని మంత్రి ఆదినారాయణరెడ్డి సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై నిప్పులు చెరిగారు. డబ్బులు సంపాదించడం కోసం ఇతర మార్గాలు కూడ ఉన్నాయని చెప్పారు.తమ ప్రాంతాన్ని కించపరిస్తే చూస్తూ ఊరుకోబోమని మంత్రి హెచ్చరించారు.

 రీల్ ‌లైఫ్ నుండి రియల్‌లైఫ్‌లోకి రావాలి

రీల్ ‌లైఫ్ నుండి రియల్‌లైఫ్‌లోకి రావాలి

రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ లోకి రావాలని మంత్రి ఆదినారాయణరెడ్డి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సూచించారు. కడపకు వచ్చి చూస్తే వాస్తవాలు తెలుస్తాయని మంత్రి రామ్‌గో‌పాల్ వర్మకు సూచించారు. ఈ తరహ పద్దతులు మానుకోవాలని సూచించారు.

కొన్ని ఘటనలను చూపి

కొన్ని ఘటనలను చూపి

గతంలో జరిగిన కొన్ని ఘటనలను చూపించి ఇప్పుడు ఈ రకంగా వ్యవహరించడం సరికాదని మంత్రి ఆదినారాయణరెడ్డి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు హితవు పలికారు.ఎప్పుడో జరిగిన ఘటనలను చూపించి ఇప్పుడు డబ్బులు వెనుకేసుకోవాలని రామ్ గోపాల్ వర్మ చూస్తున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి ఆరోపించారు.

కడప ప్రజలను అవమానించేందుకు

కడప ప్రజలను అవమానించేందుకు

కడప ప్రజలను అవమానించేందుకు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజలను అవమానపరిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. వాస్తవాలు తెలుసుకోకుండా వ్యవహరించడం సరికాదని మంత్రి రామ్‌గోపాల్ వర్మకుసూచించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ap minister Adinarayana Reddy sensational comments on Cine director Ramgopal Varma on Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి