వైఎస్సార్ ను విమర్శించే తెలంగాణా మంత్రులకు పుట్టగతులుండవ్ : మంత్రి బాలినేని ధ్వజం
వైయస్ఆర్ జయంతి సందర్భంగా వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు నేతలు వైయస్సార్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నేడు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులు వైయస్ రాజశేఖర్ రెడ్డి పై చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్ని ప్రాంతాలను సమానంగా చూసిన గొప్ప నాయకుడని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు.

ప్రజలే తెలంగాణా మంత్రులకు బుద్ధి చెప్తారు
వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించే తెలంగాణ మంత్రులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మంత్రి బాలినేని అభిప్రాయపడ్డారు. వైఎస్ ను విమర్శించే తెలంగాణ మంత్రులకు పుట్టగతులు ఉండవు అంటూ ఆయన హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ప్రజలు ఇప్పటికీ వైయస్సార్ అభిమానులుగా ఉన్నారని, వారి ఇళ్లలో నేటికీ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలు ఉన్నాయని గుర్తు చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ మంత్రులు వైయస్సార్ పై చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

హుజూరాబాద్ ఎన్నికల్లో లబ్ది కోసమే వైఎస్సార్ పై వ్యాఖ్యలు
హుజరాబాద్ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందటం కోసం వైయస్సార్ పై అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు వారిని చీదరించుకునే పరిస్థితికి తెలంగాణ మంత్రులు వచ్చారని, తెలంగాణ మంత్రులకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ తారతమ్యాలు లేకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదన్న మంత్రి బాలినేని
తెలంగాణ రాష్ట్రానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో మేలు చేశారని ప్రజలు నమ్ముతున్నారని, తెలంగాణ మంత్రులు చేస్తున్న తప్పుడు వ్యాఖ్యలను ప్రజలు నమ్మబోరని బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే వైయస్సార్ ను టార్గెట్ చేస్తున్నారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ మంత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదని తేల్చి చెప్పారు.
తాజాగా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు చోటు చేసుకున్న వేళ వైఎస్సార్ ను టార్గెట్ చేస్తూ తెలంగాణా మంత్రులు తీవ్రవ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన తెలంగాణా ప్రాంతాన్ని దోపిడీ చేశారని విమర్శిస్తున్నారు. ఇక ఏపీ నాయకులు తెలంగాణా మంత్రులకు కౌంటర్ ఇస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications