Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బనకచర్ల టార్గెట్ వెనుక షాకింగ్ రీజన్..? ఏపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వెల్లడి..!

ఏపీలోని రాయలసీమ ప్రాంతానికి కృష్ణా జలాలు విడుదలయ్యాయి. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా జలాల్ని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఇవాళ సీమకు విడుదల చేశారు. నందికొట్కూరు నియోజకవర్గం, జుపాడుబంగ్లా మండలంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్యలతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా జలాలను మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి విడుదల చేశారు.

ప్రస్తుతం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులో 878.90 అడుగుల నీరు ఉందని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. గతంలో జూలై 27వ తేదీ, అంతకు ముందు ఆగస్టులో నీళ్లు విడుదల చేశారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఎగువన వర్షాలు కురుస్తున్న కారణంగా 673.99 క్యూసెక్కుల జలాలు రెగ్యులర్‌గా వచ్చి చేరుతున్న నేపథ్యంలో సకాలంలో రైతులకు పంటలు పండే విధంగా పోతిరెడ్డిపాడు నుంచి తెలుగుగంగ, గాలేరు - నగరి సుజల స్రవంతి, హంద్రీ - నీవా సుజల స్రవంతి,ఎస్‌ఆర్‌బీసీ కాలువలకు నీటిని విడుదల చేశామన్నారు.

ap minister bc Janardhan reddy blames ts leaders s politics on banakacherla for existence

పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాలను వృధా కాకుండా అవసరం ఉన్నంత మేరకే విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులందరీకీ సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. ప్రతి చెరువును, కుంటను నింపాలన్నదే సీఎం చంద్రబాబు ఆలోచన అన్నారు.

త్వరలోనే బనకచర్ల ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామన్నారు. గోదావరిలో మిగులు జలాలను మాత్రమే వాడుకుంటామని స్పష్టంగా చెబుతున్నామన్నారు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే తెలంగాణ ప్రభుత్వం, అక్కడి పార్టీలు తాపత్రయపడుతున్నాయని మంత్రి మండిపడ్డారు. సముద్రంలో కలిసే మిగులు జలాలను వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉందన్నారు. అందులో ఏ మాత్రం తప్పు లేదన్నారు. సీఎం చంద్రబాబు గారు చాలా స్పష్టంగా లెక్కలతో సహా ఎన్ని టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయో చెప్పారని, వృధాగా వెళ్లే జలాలను కాపాడుకుని బనకచర్లను పూర్తి చేస్తే ఏపీ ఇరిగేషన్ రంగంలో గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. ముఖ్యంగా రాయలసీమతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఉపయోగపడుతుందన్నారు.

ap minister bc Janardhan reddy blames ts leaders s politics on banakacherla for existence

అలాగే అలగనూరు బండ మరమ్మత్తులు, గోరుకల్లు రిజర్వాయర్‌ మరమ్మత్తులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. గత వైసీపీ పాలకుల పాపాల వల్లే అలగనూర్ రిజర్వాయర్ బండ కుంగిపోయిందన్నారు. గత వైకాపా ప్రభుత్వం సకాలంలో స్పందించి అలగనూరు రిజర్వాయర్ పై శ్రద్ధ పెట్టి ఉంటే 20 నుండి 30 కోట్లతో పూర్తి అయ్యేదని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి 100 కోట్ల భారం అయిందని, అయినా రైతుల ప్రయోజనాల కోసం ఎంత ఖర్చయినా అలగనూరు, గోరకల్లు రిజర్వాయర్ల మరమ్మత్తులు పూర్తి చేస్తామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+