పవన్ గాలిమాటలు పట్టించుకోవద్దన్న బొత్స-చంద్రబాబు సన్నిహిత మంత్రీ అరెస్ట్-రఘురామ యూజ్ లెస్
వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్నిరోజులుగా చేస్తున్న వ్యాఖ్యల పరంపర కొనసాగుతోంది. వీటిపై ఇవాళ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. పవన్ కళ్యాణ్ గాలి మాటలపై పొద్దు పొద్దున్నే మాకేందుకీ రచ్చ అని బొత్స వ్యాఖ్యానించారు. అతని వ్యాఖ్యల్ని ఎవ్వరూ పట్టించుకోకుంటేనే మంచిదన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పుట్టిందో ముందు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలన్నారు.
దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న వాలంటీర్ వ్యవస్థ పై దుర్బుద్ధి తో విషప్రచారం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ పై బొత్స మండిపడ్డారు. ఒక్కో వాలంటీర్ 50ఇళ్ల పరిధిని చూసుకుంటాడని, ఆ 50ఇళ్ల పరిధిలో మన ఇంటి ఆడపిల్లల్ని లోబరుచుకుంటారంటూ కించపరిచే వ్యాఖ్యలు తగదన్నారు. పవణ్ కళ్యాణ్ అయన పార్ట్ నర్ చంద్రబాబు మాత్రమే హైదరాబాద్ లో ఉంటారని బొత్స తెలిపారు. ప్రజల డేటాను హైదరాబాద్ లో ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు.

Recommended Video

ఏ డేటా ఎక్కడ ఉంధి పవన్ కళ్యాణ్ కు తెలుసా.? అని బొత్స ప్రశ్నించారు. ప్రజల డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుందని, పవన్ కల్యాణ్ గాలి మాటలు మాట్లాడుతున్నారని బొత్స విమర్శించారు. పవన్ కళ్యాణ్ మాటలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అతన్ని పట్టించుకోవద్దన్నారు. వలంటిర్ ఎవ్వరూ ? ఎలా వచ్చాడు ? వాలంటీర్ వీధి విధానాలు పవన్ కళ్యాణ్ కు తెలుసా అని బొత్స అడిగారు. చంద్రబాబు సన్నిహిత సింగపూర్ మంత్రీనీ అరెస్ట్ చేసారని బొత్స గుర్తుచేశారు. అమరావతిలో ఆ మంత్రీనీ తీసుకొచ్చి అట్టహాసంగా చంద్రబాబు ప్రచారం చేశారన్నారు. సింగపూర్ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం చెల్లదని అప్పుడే చెప్పానన్నారు.
అన్నీ రాష్ట్రాలు వాలంటరీ వ్యవస్థను అమలు చేయాలని చూస్తున్నాయని, వాలంటరీ వ్యవస్తను అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ బురద చల్లాలని చూస్తున్నారన్నారు. ఏ నిఘా వర్గాలు సమాచారం ఇచ్చారో పవన్ కల్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. నిఘా వర్గాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే పవన్ కళ్యాణ్ చూపించాలన్నారు. రఘురామకృష్ణంరాజు యూజ్ లెస్ ఫెలో అని అతని యూజ్ లెస్ మాటలపై స్పందించబోనన్నారు.












Click it and Unblock the Notifications