చంద్రబాబుది ఫ్రస్టేషన్-వైసీపీ, ఈసీపై ఆరోపణలు అర్ధరహితం-బొత్స కీలక వ్యాఖ్యలు

స్ధానిక ఎన్నికల విషయంలో వైసీపీ సర్కార్, ఎన్నికల కమిషన్ పై చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్ని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ తప్పుబట్టారు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టు.. చేతగాని వాళ్ళు మాట్లాడే మాటల్లా ఉన్నాయని అన్నారు. అమరావతి రాజధాని రైతుల యాత్రను టీడీపీ వాళ్ళు చేస్తోన్న, టీడీపీనే నడిపిస్తున్న యాత్ర అని మంత్రి బొత్స అన్నారు. అమరావతి రైతులకు ఈ ప్రభుత్వం ఏం నష్టం చేసిందని ప్రశ్నించారు. వారికి హామీ ఇచ్చినట్టుగానే.. పెన్షన్లు, కౌలు అన్నీ చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్రానికి టీడీపీ వినాశికారిగా తయారైంది బొత్స ధ్వజమెత్తారు.

వైయస్సార్‌ సీపీ నేతలు, పోలీసులు కలిసి నామినేషన్లు వేయడంలో అడ్డుపడుతున్నారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు అర్థరహితమని మంత్రి బొత్స తెలిపారు. అధికారుల్ని కూడా బెదిరిస్తూ నిన్న చంద్రబాబు మాట్లాడారని, చివరికి ఒక మున్సిపల్ కమిషనర్ ను కూడా బెదిరించే స్థాయికి బాబు దిగజారాడని బొత్స ఆక్షేపించారు. తాము ఏ ఒక్కరినీ వదిలిపెట్టం అంటూ మరోసారి బెదిరించాడు. వెంటాడుతాం.. వేటాడుతాం.. అనే పదాలు కూడా వాడాడు. అంటే బాబు పార్టీ ఎన్నికల ప్రక్రియను వదిలేసి, ఎన్నికల్లో పోటీ నుంచి పారిపోయి, కత్తులు, తుపాకుల పార్టీగా మారాలనుకుంటోందా అన్నది చెప్పాలని డిమాండ్ చేశారు.

ap minister botsa satyanarayana says chandrababu in frustration, tdp backed amaravati padayatra

అన్నం పెట్టే రైతులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు రాజకీయం చేయడం సిగ్గుచేటు అని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విజయనగరం జిల్లాలోని NCS ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీ బకాయిల అంశంలో చెరుకు రైతులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారంటూ బాబు, పవన్ చేసిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. రైతులపై అసలు లాఠీ ఛార్జే జరగలేదని స్పష్టం చేశారు. రైతులు కానివాళ్ళు కొంతమంది, రైతు ఆందోళనలో చొరబడి, హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నించారన్నారు. ప్రైవేటు ఫ్యాక్టరీ అయినా.. చెరుకు రైతులకు బకాయిలు చెల్లింపుల్లో ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. వాస్తవానికి 2015 నుంచే చెరుకు రైతులకు ఆ ఫ్యాక్టరీ బకాయిలు పడిందని, 2019లో తాము అధికారంలోకి వచ్చే సమయానికి కూడా రూ. 27 కోట్ల బకాయిలు ఉన్నాయని మంత్రి బొత్స గుర్తు చేశారు.

గంజాయిపై చంద్రబాబు చేస్తున్న విమర్శలపై బొత్స మండిపడ్డారు. ఆయన హయాంలో ఏవోబీ అంతటా తులసి మొక్కలు ఉన్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ లేదు, ఆంధ్రప్రదేశ్‌ గంజాయి వనంగా మారిపోతోందంటూ చంద్రబాబు నాయుడు నిన్న మీడియ సమావేశంలో నోటికొచ్చినట్లు మాట్లాడారని,. గంజాయి సమస్య ఇప్పుడు పుట్టింది కాదని ఆయన గుర్తుచేశారు... అప్పటి టీడీపీ సర్కార్‌లో మంత్రులుగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు మాట్లాడిన వీడియోను మీడియా ముందు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రదర్శించారు. గతంలో తన మంత్రులే ఏపీ గంజాయిలో నెంబరు 1 అని చెప్పినప్పుడు బాబు ఎందుకు సిగ్గు పడలేదని బొత్స ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లే అయిందని, కానీ చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నారని, అప్పుడు గంజాయి సాగు జరుగుతుంటే ఏం చేశారన్నారు.

చంద్రబాబు నాయుడు హయాంలో ప్రస్తుత డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ విజయవాడ సీపీగా పనిచేశారని, ఆయనో నిజాయితీపరుడైన ఆఫీసర్ అని బొత్స చెప్పుకొచ్చారు. ఆయన కూడా మన రాష్ట్రం వాడు కాదని, ఓ ఎస్టీ అని, అలాంటి అధికారిని రోజూ చంద్రబాబు ఆడిపోసుకుంటున్నాడంటే.. అందుకు కూడా కారణం ఫ్రస్ట్రేషన్ అని బొత్స తెలిపారు. ఇదే డీజీపీ బాబు హయాంలో విజయవాడ నగర కమిషనర్ గా పనిచేయలేదా అని ప్రశ్నించారు. ఆరోజు గౌతమ్ సవాంగ్... ఈరోజు గౌతమ్ సవాంగ్ ఒక్కరేనని, మారింది బాబు పాత్ర మాత్రమేనన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+