వైసీపీ గుర్తు సైకిల్ - ఓటర్లపై మంత్రి ధర్మాన కామెంట్స్ వైరల్..!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ నేతలు చిత్ర విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత, మంత్రి కూడా అయిన ధర్మాన ప్రసాదరావు ఇవాళ ఓటర్లను ఉద్దేశించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జగన్ పార్టీ గుర్తు ఏంటో కూడా ఓటర్లకు తెలియడం లేదంటూ ధర్మాన చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. నిజంగానే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళంలో ఇలాంటి పరిస్దితులే ఉన్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

శ్రీకాకుళంలో మరోసారి వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో ఆయన పలువురు ఓటర్లతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి వైసీపీ గుర్తు ఫ్యాన్ అని తెలియకపోవడంతో ఆశ్చర్యపోయారు. జగన్ గుర్తు సైకిల్ లేదా హస్తం అని వారు అనుకుంటున్నారని, వైసీపీ గుర్తు అయిన ఫ్యాన్ ను జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఆయన సూచించారు.
ఎవరికి ఓటేస్తారని అడిగితే చంద్రబాబుకు అని ఓటర్లు చెబుతున్నారని ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. కాబట్టి వైసీపీ కార్యకర్తలు, నేతలు ఓటర్లలో మరింత ఆవగాహన తెప్పించేందుకు ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఏదేమైనా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎన్నికల సమయం వచ్చేసినా ఇంకా ఓటర్లకు వైసీపీ గుర్తు తెలియకపోవడమేంటని మిగతా ప్రాంతాల వారు చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications