రాజకీయాల నుంచి తప్పుకుంటా, సిద్దమా - మంత్రి కాకాణి సవాల్..!!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్..కేసుల వ్యవహారం చుట్టూ రాజకీయం తిరుగుతోంది. చంద్రబాబు అవీనితికి పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు ఆరోపణలు కొనసాగిస్తున్నారు. సీఐడీ పూర్తి ఆధారాలతోనే అరెస్ట్ చేసిందని చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ అక్రమ అరెస్ట్ అంటూ నిరసనలను కొనసాగిస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ ఈ నెల 3న విచారణకు రానుంది. చంద్రబాబు స్కిల్ స్కాం పై తాజాగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు.

చంద్రబాబు ఆధ్వర్యంలోనే : చంద్రబాబు ఆధ్వర్యంలోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం జరిగిందని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. బాబు చేసిన అవినీతి వెలుగులోకి వచ్చింది గోరంతేనని చెప్పుకొచ్చారు. అవినీతి చేయటంలో చంద్రబాబు దిట్టగా పేర్కొన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసేందుకే లోకేశ్ ఢిల్లీ వెళ్లారని మంత్రి వివరించారు. ఇన్వాయిస్‌ లేకుండా నగదును కంపెనీలకు ట్రాన్స్‌ఫర్‌ చేశారన్నారు. బాబును సమర్థిస్తున్న సోమిరెడ్డికి సిగ్గులేదని దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అవినీతి జరిగింది అనే విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు అక్రమాలు జరగలేదని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు హడావిడి చేస్తూన్నారని విమర్శించారు.

AP Minister Kakani Govardhan Reddy made serious comments against chandra Babu

టీడీపీకి సవాల్ : టీడీపీ నేతలు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి వెళ్లి అభాసు పాలయ్యారని మంత్రి కాకాని వివరించారు. విశ్వవిద్యాలయానికి, ఈ పథకానికి సంబంధం లేదని చెప్పడంతో ఆదిశంకరా కళాశాలకు వెళ్లారన్నారు. అక్కడ పది కోట్లు పెట్టామని చెప్పారని వివరించారు. పది కోట్లు పెట్టినట్లు రుజువు చేస్తే ఏమి చేసేందుకైనా సిద్ధమని చెప్పారు. వాస్తవంగా రూ.80 కోట్లు ఇవ్వాలని... ఇందులో రూ.70 కోట్లు తినేశారన్నారు. కళాశాల యజమాన్యాన్ని అడిగితే వీటి విలువ రెండు కోట్లు కూడా కావని స్పష్టం చేశారని వెల్లడించారు. పరికరాలకు సంబంధించి ఇన్వాయిస్‌ ఉండాలి అందులో ధర కూడా పొందుపరచాల్సిన అవసరం ఉందన్నారు. రూ.10 కోట్లు కూడా ఇచ్చినట్లు రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని మంత్రి సవాల్‌ విసిరారు.

అవినీతి చేసారు : టీడీపీ నేతలు చంద్రబాబు అరెస్ట్ ను అక్రమం అనటాన్ని మంత్రి కాకాని తప్పు బట్టారు. టీడీపీ నేతలు శనివారం కంచాలు.. గరిటలు మోగించి హడావిడి చేశారని ఎద్దేవా చేసారు. నిరుద్యోగుల కంచాల్లో పెట్టాల్సిన అన్నన్ని టీడీపీ నేతలు తినేశారని విమర్శించారు. అక్రమంగా అవినీతి చేశారు.. అందుకే సక్రమంగా చంద్రబాబును అరెస్టు చేశారని వివరించారు.. ఇక్కడ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన లోకేష్ ఢిల్లీకి వెళ్లి కూర్చున్నాడు. అక్కడ లోకేష్‌కు ఏమి చేయాలో అర్థం కావడం లేని పరిస్థితుల్లో ఉన్నారని మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+