నాని వ్యాఖ్యలకు అర్థం ఏమిటో: లోకేష్, చంద్రబాబుపై మంత్రి కన్నబాబు తీవ్ర విమర్శలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై టాలీవుడ్ హీరో నాని చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, పలువురు సినీ వర్గం నుంచి కూడా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా, మంత్రి కన్నబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. హీరో నాని చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏమిటో తనకు తెలియలేదని ఎద్దేవా చేశారు.

నాని వ్యాఖ్యలకు అర్థం ఏంటో..: కన్నబాబు కౌంటర్
థియేటర్లలో టికెట్ల రేట్లు సహా పార్కింగ్, తిను బండారాలపై దోపిడీ జరుగుతోందని మంత్రి కన్నబాబు తెలిపారు. టికెట్ ధరలను నియంత్రించడం కూడా ప్రభుత్వ బాధ్యత అని గుర్తుపెట్టుకోవాలన్నారు. సినిమా టికెట్ ధరలు తగ్గితే ప్రజలను అవమానించినట్లు ఎలా అవుతుందని హీరో నానిని మంత్రి కన్నబాబు సూటిగా ప్రశ్నించారు. థియేటర్లలో తనిఖీలు లేకపోతే పరిశుభ్రత ఎలా వస్తుందని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. కాగా, కాగా, నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్‌సింగరాయ్ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్యామ్‌సింగరాయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 'ఏపీలో టిక్కెట్ల విషయమై ఏం జరుగుతుందో అది కరెక్ట్ కాదని మనందరికీ తెలుసు... మీరు ప్రేక్షకులను అవమానిస్తున్నారు... ఈ పాలిటిక్స్ ను, సినిమాలను అన్నింటినీ పక్కన పెడితే ఇలా చేయడం ప్రేక్షకులను అవమానించినట్టే'అని నాని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ చూస్తున్న టికెట్ రేట్స్ రూ.10, రూ.15, రూ. 20 అని... మళ్ళీ ఇది అనవసరంగా ఏ థంబ్ నెయిల్స్ పెడతారో... రేపు అసలు సినిమా రిలీజ్ కూడా ఉంది... 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి థియేటర్లు నడుపుతున్న ఒక వ్యక్తి కౌంటర్ కంటే పక్కనే ఉన్న కిరాణా షాప్ కౌంటర్ ఎక్కువగా ఉంటే కరెక్ట్ కాదు... నా చిన్నప్పుడు స్కూల్లో అందరం పిక్నిక్ కు వెళ్లేవాళ్లం... ఆ టైంలో అందరి దగ్గరా రూ.100 అడిగేవారు. అయితే అదే సమయంలో అందరూ రూ.100 ఇవ్వగలరు... నాని నువ్వు మాత్రం ఇవ్వలేవు... నువ్వు రూ. 10 ఇస్తే చాలు అంటే అది నన్ను ఇన్సల్ట్ చేసినట్టే..." అని నాని ఏపీలో సినిమా రేట్ల తగ్గింపును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సినిమా టికెట్లు పెంచినా ప్రేక్షకులు చూస్తారన్నారు.

రెచ్చగొట్టే దోరణి అంటూ అశోక్ గజపతిరాజుపై మంత్రి కన్నబాబు
మరోవైపు టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపైనా మంత్రి కన్నబాబు విమర్శలు చేశారు. అశోక్ గజపతిరాజు ఏమైనా దైవాంశ సంభూతుడా? అని ప్రశ్నించారు. గర్భగుడిలోనే దేవాదాయశాఖ మంత్రిని, ప్రభుత్వాన్ని కించపరిచేలా అశోక్ గజపతి రాజు మాట్లాడారని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తొలగించడం ఎంతవరకు సరైందో చెప్పాలని డిమాండ్ చేశారు. అశోక్ గజపతిరాజు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం.. తిరిగి తమపై ఆరోపణలు చేయడం తప్పు అని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. అశోక్ గజపతిరాజు కోసం అధికారులు ప్రొటోకాల్ పాటించారని.. 40 ఏళ్లుగా రామతీర్థం ఆలయాన్ని అశోక్ గజపతి రాజు ఎందుకు అభివృద్ది చేయలేదని నిలదీశారు మంత్రి కన్నబాబు.

సిగ్గులేని నాయకుడంటూ చంద్రబాబుపై కన్నబాబు
ఇక ఉత్తర కుమారుడి లాగా లోకేష్ ప్రగల్భాలు పలుకుతున్నారని.. రైతుల ఆత్మహత్యలను దాయాల్సిన అవసరం తమకు లేదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు పరిపాలన కంటే వందరెట్లు ఎక్కువగా రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. దేశంలో సిగ్గు లేని నాయకుడు ఎవరని ఓటింగ్ పెడితే ఒకటి నుంచి 10 స్థానాలు చంద్రబాబుకే వస్తాయని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. రైతులను మోసం చేయబట్టే చంద్రబాబును ప్రజలు చెప్పు తీసుకుని కొట్టినట్లు 23 స్థానాలకు పరిమితం చేశారని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications