వర్మకు జనసేన చెక్ పెట్టిందా ? తేల్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్..!
ఏపీలో గత ఎన్నికల్లో తొలిసారి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు సిద్దమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అడ్డురాకుండా ఆయన గెలుపు కోసం సహకరించిన టీడీపీ సీనియర్ నేత ఎస్వీఎస్ఎన్ వర్మకు ప్రభుత్వం రాగానే తొలి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా రెండుసార్లు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతున్నా వర్మకు అవకాశం రాకపోవడం వెనుక పవన్ కళ్యాణ్ ఆయనకు చెక్ పెట్టేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.
ఇదే అంశంపై ఇవాళ జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని నాదెండ్ల తెలిపారు. వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్ అని, వాళ్ళ పార్టీ (టీడీపీ) ఆయన విషయం లో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. వర్మకు ఎమ్మెల్సీ సీటు టీడీపీ అంతర్గత వ్యవహారం అన్నారు. వర్మ ని గౌరవించడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. వర్మ కి చెక్ పెట్టాల్సిన అవసరం ఏం ఉంటుందని నాదెండ్ల ప్రశ్నించారు.

అటు తనకు ఎమ్మెల్సీ సీటు రాకపోవడంపై వర్మ ఇవాళ స్పందించరు. సీఎం చంద్ర బాబుతో తన ప్రయాణం 23 ఏళ్లుగా కొనసాగుతోందని వర్మ ఇవాళ తెలిపారు. పదవి రానంత మాత్రాన బాధ పడనని, తనకు న్యాయం చేయడానికి చంద్రబాబు ఎప్పుడు ప్రయత్నిస్తారన్నారు. కొన్ని సమీకరణాల వల్ల ఈసారి పదవి ఇవ్వలేకపోయి ఉండొచ్చని, అయినా పిఠాపురం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తున్నానని తెలిపారు. ఈ అవకాశమే తనకు పెద్ద పదవి అన్నారు. చంద్రబాబు ఆశీస్సులు తనకు ఎప్పుడు వుంటాయని, ఎన్నికలప్పుడు కూటమి నిర్ణయానికి కట్టుబడి తనతో సహా తన భార్య పిల్లలు కష్టపడి పనిచేశామని వర్మ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications