వైసీపీలో చేరాలంటే కేసులుంటే చాలు: లోకేష్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైసీపీలో చేరాలంటే సిబిఐ కేసులు ఉండడమే అర్హతని ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. తమ పేర్లు ప్యారడైజ్ పేపర్లలో లేవని ఆయన ఎద్దేవా చేశారు.

  జగన్‌ ఆస్తుల్ని అందుకే స్వాధీనం చేసుకోలేకపోతున్నా: చంద్రబాబు నాయుడు | Oneindia Telugu

  సోమవారం నాడు అమరావతిలో మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ హయంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో జగన్‌ ప్రోత్సాహంతో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ కరప్షన్‌లో రాష్ట్రం ముందుండేదని ఆయన ఎద్దేవా చేశారు.

  Ap minister Nara Lokesh made allegations on Ysrcp

  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తప్ప మరే పని లేదని మంత్రి లోకేష్‌ విమర్శించారు.. ప్యారడైజ్‌ పేపర్లలో తమ పేర్లు లేవని, తమపై సీబీఐ కేసులు లేవని ఆయన వెల్లడించారు.

  వైసీపీలో చేరాలంటే సీబీఐ కేసు ఉండాలనేది అర్హత అని ఎద్దేవాచేశారు. కృష్ణా నదిలో పడవ బోల్తా ఘటన బాధాకరమన్నారు. ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని, రోడ్ సేఫ్టీ అథారిటీ మాదిరిగానే జల రవాణాపై ఒక అథారిటీని ఏర్పాటు చేస్తామని లోకేష్‌ చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Ap minister Nara Lokesh made allegations on Ysrcp on Monday. He spoke to media on Monday at Amaravati.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి