కర్ణాటకలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్..!
కర్ణాటక రాష్ట్రంలోని సింథనూర్ లో ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ లతో కలిసి పలు అభివృద్ధి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందులో భాగంగా హోసళ్లీ క్యాంపులో నూతనంగా నిర్మించిన Sri Krishnadevaraya Sainik Schoolను మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కేంద్ర మంత్రులతో కలిసి స్కూల్‌ను లాంఛనంగా ప్రారంభిస్తూ.. విద్యా రంగంలో ఇలాంటి సంస్థలు యువతకు క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
అలానే పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రికి నిర్వాహకులు, స్థానిక తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బసవేశ్వర స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్కూల్ హాస్టల్ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి.. శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. అంతే కాకుండా పాఠశాల వ్యవస్థాపకులలో ఒకరైన దివంగత డాక్టర్ దండమూడి రాధాకృష్ణ స్మారకార్థం నిర్మించిన 'డా. రాధాకృష్ణ కళాధామ' ఓపెన్ ఆడిటోరియంను లోకేష్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ఆడిటోరియం భవిష్యత్తులో సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ..
అనంతరం Sindhanur గంగావతి రోడ్డులోని తెలుగు సంఘం కళ్యాణమండపంలో స్వర్గీయ N. T. Rama Rao కాంస్య విగ్రహాన్ని మంత్రి లోకేష్.. కేంద్ర మంత్రులు కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం తెలుగు ప్రజల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన కర్ణాటకలోని తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. "ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది" అని స్పష్టం చేశారు.
గత వైసీపీ హయాంలో చంద్రబాబు అరెస్ట్ సమయంలో సింధనూరు, రాయచూర్ ప్రాంతాల్లోని తెలుగు ప్రజలు చూపిన మద్దతును మంత్రి గుర్తుచేసుకున్నారు. ఇక కార్యక్రమం అనంతరం స్థానిక తెలుగు సంఘం నాయకులు మంత్రి లోకేశ్‌ను శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.
నేను మీ రుణం తీర్చుకోవడానికి వచ్చాను..
— Telugu Desam Party (@JaiTDP) April 4, 2026
చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సమయంలో సింధనూరు, రాయచూర్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలు అండగా నిలిచారు. మీ రుణం తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చాను. #NaraLokesh#Sindhanur#Karnataka pic.twitter.com/jAduaHHgFc












Click it and Unblock the Notifications