Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నా - ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..!!

జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర కేంద్రంగా ఏపీ రాజకీయం కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని పవన్ కల్యాణ్ పదే పదే కోరుతున్నారు. పొత్తుల అంశం మాత్రం ప్రస్తావన చేయటం లేదు. వైసీపీ లక్ష్యంగా పవన్ విమర్శలు కొనసాగుతున్నాయి. వైసీపీ నేతలు పవన్ కు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ సమయంలోనే ఏపీ మంత్రి విశ్వరూప్ కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ సీఎం కావాలని తాను కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

వైసీపీ టార్గెట్ గా పవన్ యాత్ర: పవన్ కల్యాణ్ వారాహి యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్..వైసీపీ నేతలే లక్ష్యంగా పవన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. గోదావరి జిల్లాలను వైసీపీ విముక్త జిల్లాలుగా చేయాలని పవన్ పిలుపునిచ్చారు. వారాహి సభల్లో తనకు సీఎం గా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.

AP Minister P Viswaroop made interesting comments on Pawan Kalyan want to become CM

టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని వైసీపీ బలంగా నమ్ముతోంది. దీంతో..చంద్రబాబు..పవన్ లక్ష్యంగా వైసీపీ నేతలు పవన్ ఆరోపణలను తిప్పి కొడుతున్నారు. ఇదే సమయంలో పవన్ సీఎం చేయాలనే నినాదం పైన మంత్రి విశ్వరూప్ స్పందించారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నాను అని మంత్రి విశ్వరూప్ వ్యాఖ్యానించారు.

సీఎం కావాలని కోరుకుంటున్నా: రాష్ట్రంలో ఏ నాయకుడు అయినా పాదయాత్ర..వారాహి యాత్ర చేసుకోవచ్చన్నారు. పవన్ సీఎం కావాలంటే రాష్ట్రంలోని ఆ పార్టీ 175 స్థానాల్లో పోటీ చేసి 88 సీట్లు సాధించాలని పేర్కొన్నారు. లేని పక్షంలో వంద స్థానాల్లో పోటీ చేసి 50 సీట్లలో గెలిచి సీఎం కావాటానికి ప్రయత్నించాలని సూచించారు. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రం పురోగమిస్తోందని..నాలుగేళ్లలో ఒక్క మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించలేదని మంత్రి గుర్తు చేసారు.

నవరత్నాలతోపేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పని చేస్తున్నారని వివరించారు. మరో మంత్రి రోజా పవన్ కు పార్టీ గుర్తు లేదని..జిల్లా అధ్యక్షులు లేరని..నియోజకవర్గాలకు అభ్యర్దులు లేరని ఎద్దేవా చేసారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న పవన్ సీఎం జగన్ ను ఎలా ఓడిస్తారని ప్రశ్నించారు.

కామన్ సింబల్ సమస్యగా మారేనా: జనసేనకు వచ్చే ఎన్నికల్లో కామన్ సింబల్ లేకపోవటాన్ని వైసీపీ మంత్రులు ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల గుర్తు లేకుండానే పవన్ పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. తాజాగా ఏపీ ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేనకు గాజు గ్లాసు కామన్ సింబల్ గా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం జనసేన కామన్ సింబల్ గా ఉన్న గాజు గ్లాసును ఫ్ఱీ సింబల్ గా ప్రకటన చేసింది. తిరిగి ఆ గుర్తు దక్కించుకొనేందుకు జనసేన ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కామన్ సింబల్ పైన పోటీ చేయాలంటే కేంద్రం ఎన్నికల సంఘం నిర్ణయం కీలకం కానుంది. ఇదే ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+