వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు తవ్వితే లైటరైట్-మేం తవ్వితే బాక్సైట్ వస్తుందా ?- మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్న

|
Google Oneindia TeluguNews

ఏపీలోని విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య వార్ ముదురుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు రోజూ వివరణలు ఇస్తున్న టీడీపీ విమర్శలు మాత్రం ఆపడం లేదు. దీంతో ఈసారి గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలకు ఘాటుగా కౌంటర్లు ఇచ్చారు.

విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలు జరగడం లేదని గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే లేటరైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలోనూ లేటరైట్ లీజులు ఇచ్చారని గుర్తు చేశారు. అప్పుడు తవ్వితే లేటరైట్ ఇప్పుడు తవ్వితే బాక్సైట్‌ అవుతుందా అని మంత్రి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చాకే శాశ్వతంగా బాక్సైట్‌ తవ్వకాల జీవోలు రద్దు చేశారన్నారు.

ap minister peddireddy ramachandra reddy counter to chandrababu over bauxite mining allegations

గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమ మైనింగ్‌పై తమ ప్రభుత్వం విచారణ జరిపిందని మంత్రి పెద్దిరెడ్డి
తెలిపారు. అక్రమంగా 2 లక్షల టన్నులు తవ్వినందుకు రూ.20 కోట్ల జరిమానా వేశామన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మైనింగ్‌ ప్రాంతానికి టీడీపీ నేతలు వెళ్తే ఏమొస్తుందని ప్రశ్నించిన పెద్దిరెడ్డి.. వాళ్లేమన్నా మైనింగ్‌ను నిర్ధారించే నిపుణులా అని నిలదీశారు. ప్రజలను టీడీపీ తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.

English summary
ap panchayatraj and mining minister peddireddy ramachandra reddy on today given counter to tdp chief chandrababu over bauxite mining allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X