ఇది ఇంటర్వెల్ మాత్రమే, సినిమా ఇంకా ఉంది: మూడు రాజధానులపై మంత్రి పెద్దిరెడ్డి షాకింగ్ కామెంట్స్, కొత్త ట్విస్ట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కీలకమైన మూడు రాజధానులు బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు అడ్వకేట్ జనరల్ ఈ వివరాలను నివేదించారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లును కేబినెట్ రద్దు చేస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం, మూడు రాజధానులు బిల్లు ను రద్దు చేయడంపై ఇప్పుడు ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

రాజధానుల బిల్లు ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదన్న పెద్దిరెడ్డి
ఇప్పటికే పలువురు మూడు రాజధానులు బిల్లు రద్దు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉంటే ఏపీ మంత్రులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడు రాజధానుల ఉపసంహరణపై స్పందించారు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమేనని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రాజధానుల బిల్లు ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదని ఆయన స్పష్టం చేశారు.

సినిమా ఇంకా ఉంది .. శుభం కార్డుకు సమయం ఉంది
రాజధాని అమరావతి విషయంలో ఇది ఇంటర్వెల్ మాత్రమేనని, సినిమా ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుభం కార్డుకు మరింత సమయం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాంకేతిక సమస్యలను సరిదిద్దడం కోసమే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని పేర్కొన్నారు. తాము ఇప్పటికీ మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతులు టిడిపి వేరు కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

రైతుల పాదయాత్ర పెయిడ్ ఆర్టిస్ట్ ల పాదయాత్ర
రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రను తెలుగుదేశం పార్టీనే చేయిస్తోందని ఆయన ఆరోపించారు. అమరావతి రైతుల పాదయాత్ర లక్షమందితో సాగుతోందా అంటూ ప్రశ్నించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమరావతి రైతుల పాదయాత్ర పెయిడ్ ఆర్టిస్టులు పాదయాత్రగా అభివర్ణించారు. రైతుల పాదయాత్రను చూసి భయపడి చట్టాన్ని ఉపసంహరించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. న్యాయపరమైన చిక్కుల వల్లే మూడు రాజధానుల ఉపసంహరణ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని పేర్కొన్న ఆయన, క్యాబినెట్ సమావేశంలో తాను లేనని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానంటూ పేర్కొన్నారు.

పెద్దిరెడ్డి వ్యాఖ్యలతో కొత్త అనుమానం .. కచ్చితంగా ఈ నిర్ణయం వెనుక ట్విస్ట్
ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చుకోవడం లేదని, కేవలం కోర్టులో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించుకోవడం కోసమే, మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటోంది అన్న అనుమానం వ్యక్తమవుతోంది. సాంకేతిక పరమైన సమస్యలను పరిష్కరించి మళ్ళీ మూడు రాజధానులను తెరమీదకు తెచ్చే అవకాశం లేక పోలేదన్న చర్చ జరుగుతుంది. ఏదేమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్న సంచలన నిర్ణయం వెనుక ట్విస్ట్ కచ్చితంగా ఉంటుందన్న చర్చ ప్రస్తుతం ఏపీలో జోరుగా సాగుతోంది.

నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా సరే .. జగన్ ఏం చెయ్యబోతున్నారన్న ఉత్కంఠ
మరోవైపు ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఉపసంహరణ నిర్ణయంపై ఏపీ బీజేపీ శ్రేణుల నుండి హర్షం వ్యక్తం అవుతుంది. మరోవైపు రాజధాని అమరావతి రైతులు సాధించిన విజయం అని, రైతుల పోరాటానికి ఫలితం లభించిందని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని టీడీపీ, బీజేపీ తో సహా అన్ని విపక్షాలు సీఎం జగన్ రాజధాని అమరావతికే కట్టుబడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక రైతుల మహాపాదయాత్రలో ఏపీ సర్కార్ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం అవుతుంది. అయినా సరే అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని రైతులు మహాపాదయాత్రను కొనసాగించనున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఏం చెయ్యబోతున్నారన్న ఉత్కంఠ నెలకొంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications