అక్రమ ఇసుక దందాల వల్లే టీడీపీ ఓడిపోయింది... మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవినీతిపై ఉక్కు పాదం మోపుతున్న విషయం తెలిసిందే...ఈనేపథ్యంలోనే ఆయన తన స్వంత మంత్రులనే హెచ్చరించారు. దీంతోపాటు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీసీ ప్రజల ముందు పెట్టాలని తన మంత్రివర్గానికి సూచించారు. దీంతో మంత్రులు ఇక అదే పనిలో ఉన్నారు. రాష్ట్ర్రంలో అక్రమాలకు అవినీతికి తావులేకుండా పరిపాలనను కొనసాగించేందుకు సిద్దమవుతున్నారు.

ఈనేపథ్యంలోనే ఇసుక అక్రమ దందాపై మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి దృష్టి సారించారు. వెంటనే రాష్ట్ర్రంలో నడుస్తున్న ఇసుక తవ్వకాలను ఆపివేయాలని ఆదేశించాడు. ఇసుక రవాణాకు సంబంధించి పదిహేను రోజుల్లో కొత్త విధానాన్ని తీసుకు వస్తామని ప్రకటించారు. ఈనేపథ్యంలోనే ఇసుక అక్రమ రవాణకు పాల్పడితే పీడీ యాక్టు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

AP Minister Peddireddy Ramchandra Reddy focused on the illegal sanding

గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపించారు.కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో తెదేపా నేతలు ఇసుక రవాణాతో వేలకోట్ల రూపాయలు సంపాదించారని మంత్రి ఆరోపించారు.జిల్లాల్లో ఇసుక అక్రమ దందావల్లే గత టీడీపీ ప్రభుత్వం ఓడిపోయిందని ఆయన ప్రకటించారు. కాగా ఉభయ గోదావరి జిల్లాల నుండి చెన్నై కర్ణాటక, తమిళనాడు రాష్ట్ట్ర్రాలకు తరలిస్తున్నారని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+