AP Minister Portfolio 2022: డిప్యూటీ సీఎంలు ఖరారు- హోం శాఖ మహిళకే : రోజకు ఇదే..!!

ఏపీలో కొత్త మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులకు సీఎం జగన్ శాఖలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ల శాఖల్లోనూ మార్పులు చేసారు. అయిదు వర్గాలకు గతంలో లాగానే అయిదు డిప్యూటీ సీఎం పదవులు కేటాయించారు. ఎస్టీ కోటాలో డిప్యూటీ సీఎంగా రాజన్న దొర...బీసీ కోటాలో బూడి ముత్యాల నాయుడుకు దక్కింది.

కాపు వర్గం నుంచి కొట్టు సత్యనారాయణకు కేటాయించారు. మైనార్టీ వర్గం నుంచి అంజాద్ భాషాకు తిరిగి దక్కింది. ఎస్సీ కేటగిరీలో నారాయణ స్వామికి తిరిగి కేటాయిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ధర్మాన ప్రసాదరావు - రెవిన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖ కేటాయించారు. అప్పలరాజుకు తిరిగి పశు సంవర్ధక, మత్స్య శాఖ అప్పగించారు.

శాఖల కేటాయింపులో పక్కా లెక్కలు

శాఖల కేటాయింపులో పక్కా లెక్కలు

బొత్సా సత్యనారాయణకు శాఖ మారింది. గతంలో పురపాలక శాఖ నుంచి విద్యా శాఖకు మార్పు చేసారు. రాజన్న దొర డిప్యూటీ సీఎం హోదాలో గిరిజన సంక్షేమ శాఖ పర్యవేక్షించనున్నారు. గుడివాడ అమర్నాధ్ కు పరిశ్రమలు..ఐటీ..పెట్టుబడులు..మౌళిక వసతుల శాఖ ఖరారు చేసారు.

ముత్యాల నాయుడు డిప్యూటీ సీఎం హోదాలో పంచాయితీ రాజ్- గ్రామీణాభివ్రుద్ది కేటాయిచారు. దాడిశెట్టి రాజాకు రోడ్లు - భవనాల శాఖ దక్కింది. పినిపె విశ్వరూప్ కు రవాణా శాఖ పర్యవేక్షించనున్నారు. చెల్లుబోయిన వేణు కు సమాచార శాఖతో పాటుగా బీసీ సంక్షేమం సైతం అప్పగించారు.

హోం మంత్రిగా ఎస్సీ మహిళకే

హోం మంత్రిగా ఎస్సీ మహిళకే

హోం శాఖ మంత్రిగా తిరిగి ఎస్సీ మహిళకు ఇచ్చారు. తానేటి వనిత ఏపీకి రెండో మహిళా హోం మంత్రిగా వ్యవహరించనున్నారు. కారుమూరు నాగేశ్వరరావుకు పౌర సరఫరాల శాఖ కేటాయించారు. కొట్టు సత్యనారాయణకు డిప్యూటీ సీఎం హోదాలో ఆయనకు దేవాదాయ శాఖ అప్పగించారు.

క్రిష్ణా జిల్లాకు చెందిన ఏకైక మంత్రి జోగి రమేష్ కు కీలకమైన హౌసింగ్ శాఖ కేటాయించారు. మేరుగ నాగార్జున - ఎస్సీ సంక్షేమం కేటాయించారు. విడదల రజనీ - విద్యా ..ఆరోగ్య శాఖ అప్పగించారు. అంబటి రాంబాబుకు జనవనరుల శాఖ కేటాయిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆదిమూలపు సురేష్ ను పురపాలక శాఖ కేటాయించారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి వ్యవసాయ శాఖ దక్కింది.

బొత్సా శాఖ మార్పు..రజనీకి ఆరోగ్య శాఖ

బొత్సా శాఖ మార్పు..రజనీకి ఆరోగ్య శాఖ

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - మైనింగ్, విద్యుత్, పర్యావరణ శాఖ అప్పగించారు. ఆర్కే రోజా - టూరిజం..యువజన వ్యవహారాల శాఖ కేటాయించారు. నారాయణ స్వామి డిప్యూటీ సీఎం హోదాలో ఎక్సైజ్ శాఖ కొనసాగించారు. అంజాద్ బాషా డిప్యూటీ సీఎం హోదాలో మైనార్టీ వ్యవహారాల శాఖ పర్యవేక్షించనున్నారు.

బుగ్గన రాజేంద్రనాద్ కు గతంలో నిర్వహించిన ఆర్దిక శాఖ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జయరాం కు కార్మిక శాఖ కొనసాగనుంది. ఉషశ్రీ చరణ్ - మహిళా శిశు సంక్షేమంతో పాటుగా సీనియర్ సిటిజన్ శాఖ కేటాయిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+