‘ఆడుదాం ఆంధ్రా’: 100 కోట్ల గొప్ప క్రీడా సంబరం, 12 కోట్ల ప్రైజ్ మనీ

విజయవాడ: క్రీడాభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా పేరుతో ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. 'ఆడుదాం ఆంధ్రా' రాష్ట్ర వ్యాప్త క్రీడా టోర్నమెంట్ల వీడియో లాంఛ్, బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శాఫ్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో కలిసి క్రీడా శాఖ మంత్రి రోజా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆడుదాం ఆంధ్రా వంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదన్నారు. ప్రస్తుతం యువతలో ఫిజికల్ ఫిట్నెస్ సరిగా ఉండటం లేదన్నారు. ఆడుదాం ఆంధ్రా యువతకు మంచి అవకాశం అని చెప్పారు. టోర్నమెంట్‌లో 12 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందిస్తామని మంత్రి రోజా తెలిపారు.

AP minister roja launches adudam andhra brochure.

రూ. 100 కోట్ల బడ్జెట్‌తో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని రోజా తెలిపారు. టోర్నమెంట్ లో పాల్గొనేందుకు 72 గంటల్లో 5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంతమంచి అవకాశం మళ్లీ వస్తుందో లేదో.. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోటి మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు.

ఏపీ ఆటల ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని చెప్పారు మంత్రి రోజా. ఆడ పిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొనాలని రోజా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శాప్ ఛైర్మన్ సిద్ధార్థ్ మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడే వస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉండేదన్నారు. సీఎం వైఎస్ జగన్ ఏపీలో ఒక ట్రెండ్‌ను సృష్టించారన్నారు.

ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి నాయకుడిని నిత్యం జనాల్లో ఉడేలా సీఎం జగన్ చూశారన్నారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద క్రీడా సంబరం అని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+