సినిమా సెట్టింగ్ లా జగన్ టూర్ ..! ఆధారాలివిగో అన్న ఏపీ మంత్రులు ..!

ఏపీలో ఇవాళ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రులు ఫైర్ అయ్యారు. జగన్ టూర్ సందర్భంగా వైసీపీ నేతలు రెచ్చిపోవడం, జనం భారీగా మార్కెట్ యార్డ్ లోకి తోసుకురావడం, మామిడి పండ్లను రోడ్లపైకి తెచ్చి పారబోయడం వంటి చర్యలపై మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ బంగారుపాళ్యం టూర్ లో స్థానిక డీఎస్సీని రప్పా రప్పా చెయ్యి నరికేయండి అంటూ.. వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల వీడియోను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ బయటపెట్టారు. జగన్ కారు వస్తుండగా ప్రణాళికాబద్ధంగా ప్రకాష్ రెడ్డి తోట నుంచి..మామిడి లోడ్ తెచ్చారంటూ ఆయన ఆధారాలు బయటపెట్టారు. శవాలపై, రక్తపు పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ అని ఆయన విమర్శించారు. రైతుల మేలు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మంత్రి అనగాని తెలిపారు.

ap ministers atchannaidu anagani satyaprasad slams ys jagan s bangarupalyam tour as cine setting

మరోవైపు జగన్ బంగారుపాళ్యం టూర్ ను వ్యవసాయమంత్రి అచ్చెన్నాయుడు సినిమా సెట్టింగ్ గా అభివర్ణించారు. లేని సమస్యను సృష్టించేందుకు జగన్ పర్యటన జరిగిందన్నారు. అన్నమయ్య జిల్లాల్లో 99 శాతం మామిడి కొనుగోళ్లు పూర్తయ్యాయని తెలిపారు. పరిష్కారం కోసం కాదు, ప్రచారం కోసమే వాళ్ల ఆరాటం అని ఆరోపించారు. జనసమీకరణ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు.

డబ్బులు ఖర్చు పెట్టి మరీ జనాలను తీసుకొస్తున్నారని మంత్రి అచ్చెన్న ఆరోపించారు. 6 కి.మీ దూరంలో హెలిప్యాడ్‌కు అనుమతి కావాలన్నారని, 100 మీటర్ల దూరంలో అనుమతి ఇస్తామంటే ఒప్పుకోరని ఆక్షేపించారు. హెలిప్యాడ్ దగ్గరకు వచ్చి విధ్వంసం చేస్తున్నారన్నారు. క్రిమినల్ ఆలోచనలు, సెట్టింగ్‌లతోనే..ఇలాంటి కార్యక్రమాలు చేశారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.

ap ministers atchannaidu anagani satyaprasad slams ys jagan s bangarupalyam tour as cine setting

బంగారుపాళ్యంలో రోడ్డు మీద పార్టీ నేతలతో మామిడి కాయలు పారబోయించిన వ్యవహారంపై వాస్తవాల్ని ఆయన వెల్లడించారు.
ముందుస్తు వ్యూహంలో భాగంగా 5 ట్రాక్టర్లను సిద్దం చేసుకుని జగన్ రాగానే వైసీపీ కార్యకర్తలు రోడ్డుపై పంటను పారబోశారన్నారు.
మామిడి కాయలు తెచ్చిన 5 ట్రాక్టర్లు ముందుగానే సిద్దం చేసుకుని పెట్టుకున్నట్లు నిర్థారించారు. వీటి రిజిస్ట్రేషన్ నంబర్లు..
AP03-AA-0218.. AP20-U-9212, AP03-M-018, AP03-S-8542, AP03-TB-5532 గా గుర్తించామన్నారు. ఈ ట్రాక్టర్లలో వైసీపీ వారికి చెందిన వారి ద్వారా కాయల తరలింపు, పారబోత చేశారన్నారు. మామిడికాయలు ఎవరి దగ్గరి నుంచి వచ్చాయి, ఎవరు తెచ్చారు అనే వివరాలను ఆయన వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+