వాలంటీర్లు, పెన్షన్ల పంపిణీపై కొత్త సర్కార్ క్లారిటీ-తేల్చేసిన ఏపీ మంత్రులు..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవాళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. కీలక అంశాలపై తొలి ఐదు సంతకాలను చేసారు. ఇందులో మెగా డీఎస్సీ, ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు, పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్దరణ, స్కిల్ డెవలప్మెంట్ పై ఐదు సంతకాలు చేసారు. ఈ నేపథ్యంలో మంత్రులు నిమ్మల రామనాయుడు, డోలా బాల వీరాంజనేయస్వామి, సవిత తొలి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో పలు అంశాలపై వారు క్లారిటీ ఇచ్చారు.

మెగా డీఎస్సీపై జగన్ దగా చేస్తే తాము మాట నిలబెట్టుకున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేశామన్నారు. మీ బిడ్డ అంటూనే జగన్ పాస్ బుక్కుల మీద, ఆస్తుల పత్రాల మీద ఫొటోలు వేయించుకున్నారని, తద్వారా మీ ఆస్తులకు ఆయన వారసుడిగా మారిపోయారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను గుప్పిట్లో పెట్టుకునేందుకు జగన్ తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు చేశామన్నారు.

ap ministers clarified on volunteers system pensions door delivery after Chandrababu 5 signatures

అలాగే రాష్ట్రంలో నిరాదరణకు గురవుతున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ల పెంపుపై చంద్రబాబు మూడో సంతకం చేశారని, బకాయిలతో కలిపి జూలై ఒకటిన 7 వేల పెన్షన్ ఇవ్వబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇంటి వద్దే పెన్షన్లు ఇస్తామన్నారు. పెన్షన్లు అంటేనే టీడీపీ అని, 35 రూపాయల పెన్షన్ 200 చేసి ఆ తర్వాత వెయ్యి, రెండు వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే అన్నారు. వెయ్యి రూపాయల పెన్షన్ పెంపుకు జగన్ కు ఐదేళ్లు పట్టింది. జగన్ లా మాట తప్పకుండా మేం వెయ్యి రూపాయలు పెంచేందుకు ఒకరోజే పట్టిందన్నారు.

అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం పెట్టారని మంత్రి రామానాయుడు తెలిపారు. నిరుపేదలు, మధ్య తరగతికి రోజుకు 15 రూపాయలకే మూడు పూటలా భోజనం పెట్టే అవకాశం ఉందన్నారు. పొరుగున తమిళనాడులో జయలలిత అమ్మ క్యాంటీన్లను కొనసాగిస్తే జగన్ మాత్రం అన్న క్యాంటీన్లను ఎత్తేశారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఫైలుపై ఐదో సంతకం చేశారని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని, రద్దు కాలేదని రామానాయుడు తెలిపారు. వైసీపీ ఒత్తిడితో కొంతమంది రాజీనామా చేశారని, దీనిపై త్వరలో సమీక్షించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. వాలంటీర్లతో ఇంటింటికీ పెన్షన్ ఇప్పిస్తాం. రాజీనామాలు చేసిన చోట వాలంటీర్లను భర్తీ చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+