అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయ్‌కుమార్‌ కులమేంటో చంద్రబాబుకు తెలుసు.. అందుకే అవమానించారు.. ఎస్సీ మంత్రుల ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీలో రాజధాని మార్పుపై నివేదిక ఇచ్చిన బోస్టన్ కమిటీ చుట్టూ కొత్త వివాదం రాజుకుంది. సీఎం జగన్‌కు బోస్టన్ ప్రతినిధులు నివేదిక అందించిన అరగంట వ్యవధిలోనే.. ఏపీ ప్రణాలికా సంఘ్ కార్యదర్శి, మున్సిపల్‌శాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌ మీడియా ముందుకొచ్చి.. బోస్టన్ నివేదికలోని అంశాలన్ని వెల్లడించారు. ఈక్రమంలోనే విజయ్ కుమార ని ఉద్దేశించి మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

విజయ్ కుమార్ ఎవడు?

విజయ్ కుమార్ ఎవడు?

బోస్టన్ కమిటీ నివేదిక బయటికొచ్చిన కొద్దిసేపటికే ప్రెస్ మీట్ ఏర్పాటుచేసిన చంద్రబాబు.. కమిటీ అథెంటిసిటీని సవాలు చేస్తూ పలు ప్రశ్నలు సంధించారు. కనీసం రిపోర్టులో ఏముందో చదవకుండా వివరాల్ని బయటపెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘‘రిపోర్టు సారాంశాన్ని అరగంటలోనే అర్థం చేసుకునేంత ట్యాలెంట్ మీకుందా? ఓ ప్రైవేటు కంపెనీ తయారుచేసిన రిపోర్టును చదవడానికి విజయ్ కుమార్ ఎవడు? వాడెవడో రిపోర్టిస్తాడట.. వీడెవడో చదువుతాడట..''అంటూ చంద్రబాబు ఫైరయ్యారు.

ఎస్పీ అయినందుకే ఇలా..

ఎస్పీ అయినందుకే ఇలా..

కాగా, ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ని ఉద్దేశించి చంద్రబాబు చేసిన కామెంట్లపై ఏపీ మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయ్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టే.. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా అవమానించే ప్రయత్నం చేశారని మంత్రులు మండిపడ్డారు. ఐఏఎస్ అదికారికి చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మంత్రులు సూచరిత, విశ్వరూప్, సురేశ్, వనిత,నారాయణస్వామిలు ఆదివారం ఉమ్మడిగా ఒక లేఖను రాశాను.

కులదురహంకారి చంద్రబాబు..

కులదురహంకారి చంద్రబాబు..

చంద్రబాబు ఓ కులదురహంకారి అని, గతంలో చాలా సార్లు ఆయన దుర్బుద్ధిని బయటపెట్టుకున్నాడని లేఖలో మంత్రులు ఆరోపించారు. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని.. బీసీల తోకలు కత్తిరిస్తానని.. చంద్రబాబు గతంలో చేసిన కామెంట్లను కూడా ప్రస్తావించారు. విజయ్ కుమార్ కులం ఏమిటో చంద్రబాబుకు తెలుసుకాబట్టే అవమానించేలా మాట్లాడారని లేఖలో తెలిపారు. రాజ్యాంగంపై గౌరవం, సామాజిక సంస్కారం చంద్రబాబుకు లేవని, నోటిని అదుపులో పెట్టుకోకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చంద్రబాబును మంత్రులు హెచ్చరించారు.

English summary
AP ministers demands apology From TDP Chief Chandrababu for making casteite remarks On Municipal commissioner Vijay kumar, who read theBostan comitee reoprt before meadia
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X