'వరుస భేటీలతో రెచ్చగొడుతున్నారు, జగన్! వేదిక-టైం చెప్పు'
ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రులు సోమవారం నాడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. జగన్‌తో పాటు కాపు నేత ముద్రగడ పద్మనాభం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంత్రులు సోమవారం నాడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. జగన్‌తో పాటు కాపు నేత ముద్రగడ పద్మనాభం పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముద్రగడ పద్మనాభం వ్యక్తిగత ప్రయోజనాల కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అవుతూ కాపులను టిడిపి ప్రభుత్వం పైకి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ జగన్‌కు లబ్ధి చేకూర్చుతున్నారని ధ్వజమెత్తారు. వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి ముద్రగడ సామాజిక వర్గాన్ని ఉపయోగించుకుంటూ, శిఖండిగా మారారని విమర్శించారు.

టైం చెప్పు
జగన్ ప్రభుత్వంపై, చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. రెండున్నరేళ్ల అభివృద్ధిపై జగన్‌తో బహిరంగ చర్చకు తాము సిద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. వేదిక, సమయం జగనే చెప్పాలని సవాల్ విసిరారు.
రైతులు సంతోషంగా ఉండకూడదనేదే జగన్ అభిమతం అని మరో మంత్రి ప్రతిపాటి పుల్లారావు విమర్శించారు. రైతులు కష్టాల్లో ఉంటే ఈయన ఓదార్పు చేయాలనే దురాలోచనతో ఉన్నారని, ఆయనకు కేసులు, సూట్‌కేసులు తప్ప రైతుల సమస్యలు తెలియవన్నారు. జన్మభూమి కార్యక్రమానికి వస్తున్న ఆధరణను చూసి జగన్‌కు నిద్రపట్టడం లేదన్నారు.












Click it and Unblock the Notifications