జగన్ ఏపిని కేసీఆర్ కు తాకట్టు పెడుతున్నారు : ఆ ముగ్గురు కుట్రలు చేస్తున్నారు: మంత్రుల ఫైర్..!
ఏపి మంత్రులు ఎన్నికల వేళ జగన్ లక్ష్యంగా అస్త్రాలు సంధిస్తున్నారు. మోదీ, కేసీఆర్, జగన్ కుట్రల కూటమిగా ఏర్పడి తెదేపాను దెబ్బతీయాలని చూస్తున్నారని మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జగన్‌కు ఉన్నంత పదవి, డబ్బు వ్యామోహం దేశవ్యాప్తంగా మరి ఏ ఇతర రాజకీయ నాయకుడికీ లేదని మరో మంత్రి నక్కా ఆనంద్‌బాబు దుయ్యబట్టారు.
ముగ్గురు కలిసి కుట్ర..
ఏపిని బలహీన పర్చటమే లక్ష్యంగా ఆ ముగ్గురూ కుట్రలు చేస్తున్నారని ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడు విమ ర్శించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి వారు ఓర్వలేకపోతున్నారని, అందుకే కుట్రలు పన్నుతున్నా రని వారు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో జగన్ రాష్ట్రాన్ని కేసీఆర్‌కు తనఖా పెట్టాలని చూస్తున్నారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. జగన్ కుట్ర చాలా ప్రమాదకరమైంద ని, రాష్ట్రానికి ఇంత నష్టం చేసే పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

తెదేపాను ఎదుర్కోలేక వారు కూటమిగా ఏర్పడుతున్నారని విమర్శించారు. మోదీ నాయకత్వంలో జగన్, కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని దుయ్య బట్టారు. అభివృద్ధిని అడ్డుకునే వారిలో జగన్ ప్రథముడని, రాజకీయంగా ఏపీకి మరింత ద్రోహం చేయాలన్న దుర్బు ద్ధితో కూటమి ఉందని ఆక్షేపించారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న బెదిరింపులు ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.
జగన్ కు అధికారం ఎండమావే..
మరో మంత్రి నక్కా ఆనందబాబు సైతం జగన్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేసారు. వైకాపాకు రాష్ట్రంలో అధికారం ఎండమావేనని మరో మంత్రి ఆనంద్‌బాబు అన్నారు. కేసీఆర్ ఆలోచనలను జగన్ ఆచరణలో పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నిరంతరం అలజడి, అశాంతి తీసుకురావాలని యోచిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే చింతమనేని 3 నెలల క్రితం మాట్లాడిన వీడియోను ఎడిట్ చేసి ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ అధికారం దక్కించుకోవటానికి అనేక కుట్రలు చేస్తున్నారని..రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆనంద బాబు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications