Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం జగన్‌ అక్కున చేర్చుకున్నారు..!!

మళ్లీ అధికారమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. నేతల వరుస పర్యటనలు, యాత్రలతో నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ అమలు చేస్తోంది. అందులో భాగంగా బస్సుయాత్ర చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. సామాజిక న్యాయ యాత్ర పేరుతో జరిగే ఈ బస్సు యాత్రలో భాగంగా రోజూ మూడు ప్రాంతాల్లో వైసీపీ నేతలు పర్యటించనున్నారు. నేటి నుంచి ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమలో శింగ‌న‌మ‌ల‌ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది.

ఏకైక సీఎంగా జగన్
దేశ చరిత్రలో సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని వైసీపీ మంత్రులు..నేతలు పేర్కొన్నారు. సామాజిక సాధికార యాత్ర బస్సుకు పూజలు చేసి, ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో మూడు విడతలుగా సామాజిక సాధికార యాత్ర జరుగుతుందన్నారు. తొలి విడత యాత్ర గురువారం ప్రారంభమవుతుందని.. నవంబర్‌ 9న ముగుస్తుందని చెప్పారు.

AP Ministers launch YSRCP samajika Sadhikara Bus Yatra, made key comments on Chandra Babu

రోజూ మూడు ప్రాంతాల్లో ఒక్కో నియోజకవర్గంలో ఈ యాత్ర జరుగుతుందని.. సాయంత్రం బహిరంగ సభలు నిర్వహిస్తామని మంత్రులు సురేష్..నాగార్జున వెల్లడించారు. తొలి విడతలో మూడు ప్రాంతాల్లోని 39 నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగుతుందని వివరించారు. యాత్రలో పేదలందరినీ ఏకం చేసి పెత్తందార్లపై రణభేరి మోగిస్తామని ప్రకటించారు.

అన్ని వర్గాల నుంచి మద్దతు
వచ్చే ఎన్నికల సంగ్రామంలో.. పేదల పక్షాన నిలిచిన సీఎం వైఎస్‌ జగన్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దన్నుగా నిలిచి, పెత్తందార్లను మట్టికరిపించాలని పిలుపునిచ్చారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు దళితులను అవహేళన చేసారని చెప్పుకొచ్చారు. కేబినెట్‌ నుంచి నామినేటెడ్‌ పదవుల వరకూ సింహభాగం పదవులిచ్చి అక్కున చేర్చుకుని ఆత్మగౌరవం నిలిపిన నేత సీఎం జగన్‌ అని మంత్రి నాగార్జున విశ్లేషించారు.

జగనన్న సీఎం అయ్యాక పేదలకు అవే ఆలయ కమిటీల్లో పదవులిచ్చారు. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి, తర్వాత తప్పించుకునే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి సురేష్ విమర్శించారు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి జగనన్న. తమ పక్షాన నిలిచిన జగనన్నకు పేదలు దన్నుగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేసారు.

పేదల కోసం యాత్ర
సామాజిక సాధికార యాత్ర పేరుతో తాము పేదల కోసం బస్సు యాత్ర చేస్తుంటే.. నిజం గెలవాలనే పేరుతో జైల్లో ఉన్న వ్యక్తి కోసం భువనేశ్వరి యాత్ర చేస్తున్నారని మంత్రి నాగార్జున వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను ఓటు బ్యాంకుగానే చూసిందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆ వర్గాలను పేదరికం నుంచి గట్టెక్కించేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వివరించారు.

AP Ministers launch YSRCP samajika Sadhikara Bus Yatra, made key comments on Chandra Babu

దీని వల్లే రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గిందన్నారు.రాష్ట్ర వనరులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందించాలనే తపనతో సీఎం జగన్‌ పనిచేస్తున్నారని సీనియర్ నేత పార్దసారధి పేర్కొన్నారు. అర్హతే ప్రామాణికంగా వివక్షకు తావులేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాల ద్వారా పేదలకు లబ్ధి చేకూర్చుతున్నారని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+