పవన్ రాజకీయ నాయకుడే కాదన్న పెద్దిరెడ్డి-ఊరకుక్కలన్నీ ఏకమవుతున్నాయన్న అప్పలరాజు..
ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన వార్ ముదురుతోంది. నిన్న వైసీపీ నేతలు,మంత్రులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ స్ట్రాంగ్ కౌంటర్లు పడుతున్నాయి. వైసీపీ మంత్రులు,నేతలు ఒకరి వెంట మరొకరు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలకు దిగుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో అర్ధమవుతోంది.
పవన్ కళ్యాణ్ నిన్న చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబుతో భేటీపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ స్పందించారు. పవన్ అసలు రాజకీయ నేతే కాదని ఆయన తెలిపారు. రాజకీయాలకూ, ఆయనకూ సంబంధం లేదన్నారు. చంద్రబాబు ఎవరితోనైనా కలుస్తారని, సీఎం కావడమే ఆయన లక్ష్యమన్నారు. జగన్ ను ఎదుర్కోవడం సాధ్యం కాదు కాబట్టే చంద్రబాబు పవన్ ను వెళ్లి కలిశారన్నారు.

పవన్ వ్యాఖ్యలపై మరో మంత్రి సీదిరి అప్పలరాజు కూడా తీవ్రంగా స్పందించారు. విశాఖ గర్జన తర్వాత ఊరకుక్కలన్నీ ఏకమవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులపై దాడులకు ప్రేరేపించిన వారిని బాబు పరామర్శించడమా అని మంత్రి ప్రశ్నించారు. బాబు దగ్గర ప్యాకేజీ.. తద్వారా మహిళల్ని వాడుకోవడం.. వదిలేయడం పవన్ పెళ్ళిళ్ళ థియరీ అన్నారు. బాబు- పవన్ లు పైకి ముసిముసి నవ్వులు.. కింద ప్యాంట్లు తడిచిపోతున్నాయన్నారు. ఫాం హౌస్ లో యుద్ధానికే పవన్ కల్యాణ్ సిద్ధమని అప్పలరాజు తెలిపారు. మంత్రులపై దాడి చేయడం ఏ ప్రజాస్వామ్యమో బాబు చెప్పాలన్నారు.ప్రజాస్వామ్య హంతకులే.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారా అని మంత్రి ప్రశ్నించారు. అటు నిజ జీవితంలోనూ ఇటు రాజకీయాల్లోనూ పవన్ ది అనైతికతేనని అప్పలరాజు విమర్శించారు. జగన్ అంటే పచ్చమందకి భయమన్నారు.












Click it and Unblock the Notifications