విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల...ఆటాడుకుందాం రా!...ఈ నెల 24 నుంచి

|
Google Oneindia TeluguNews

అమరావతి:తాజా రాజకీయ పరిణామాలతో బుర్ర వేడెక్కిపోయివున్న ఎపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొన్ని రోజులు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేందుకు అవకాశం కల్పించాలని శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిర్ణయించారు. అందుకే ఈ ప్రజా ప్రతినిధులందరికి క్రీడల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 24 నుంచి 27 వరకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో శాసనసభ, శాసనమండలి సభ్యులకు క్రీడల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం జరిగింది. అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన మంగళవారం ఆయన ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఈ నెల 24 నుంచి 26 వరకు ఆటల పోటీలు నిర్వహిస్తారు.

AP MLA MLC Sports Meet will begins on March 24

మొత్తం 10 రకాల ఆటల్లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిసింది. అనంతరం 27న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలకు సంబంధించి జరిగిన ప్రత్యేక సమావేశంలో మండలి ఉపసభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రులు యనమల రామకృష్ణుడు, కాలవ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, అయ్యన్న, కొల్లు రవీంద్ర, చీఫ్‌విప్‌ రఘునాథరెడ్డి, విప్‌ కూన రవికుమార్‌, ఇన్‌ చార్జ్‌ సెక్రటరీ విజయరాజు తదిదరులు పాల్గొన్నారు.

English summary
The AP Assembly will organize sports meet and cultural events for MLS's and MLC's from the 24th of this month. Assembly Speaker Kodela Sivaprasad said on Tuesday. These events will be held at Vijayawada Indhira Gandhi Municipal Stadium.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X