ఏపీలో అధికారం దక్కేదెవరికి : ముందుగానే ఫలితాలు -లెక్క ఇలా..!?

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కేదెవరికి. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే పబ్లిక్ పల్స్ స్పష్టం కానుంది.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కేదెవరికి. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ..చర్చలు ఇప్పటికే ఆరంభమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే పబ్లిక్ పల్స్ స్పష్టం కానుంది. వచ్చే నెల ఇందుకు ముహూర్తగా ఫిక్స్ అయింది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ప్రజా మూడ్ స్పష్టం కానుంది. ఫైనల్ పోరు ముందు ఇది సెమీస్ గా మారుతోంది. దీంతో..ఇప్పుడు ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది.

ఏపీలో సెమీస్ కు ముహూర్తం ఖరారు

ఏపీలో సెమీస్ కు ముహూర్తం ఖరారు

ఏపీలో2024 తొలి త్రైమాసికంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా..ప్రజల మూడ్ తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకొసం వచ్చే నెలలో సెమీ పైనల్స్ లో పబ్లిక్ పైన స్పష్టత రానుంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. అందులో స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎన్నికలు మినహా టీచర్లు - గ్రాడ్యుయేటర్ల నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికలు కీలకం కానున్నాయి. తొమ్మది జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగంచుకొనే డిగ్రీ చదివిన వారు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2019 ఎన్నికల్లో ఉపాధ్యాయుల్లో అధిక శాతం వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో పబ్లిక్ మూడ్ స్పష్టం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

హోరా హోరీగా బరిలో ప్రధాన పార్టీలు..

హోరా హోరీగా బరిలో ప్రధాన పార్టీలు..

ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రకాశం -నెల్లూరు- చిత్తూరు నియోజకవర్గంతో పాటుగా కడప- అనంతపురం- కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గానికి షెడ్యూల్ విడుదల అయింది. ఈ రెండు స్థానాల్లో ప్రస్తుతం సభ్యులుగా ఉన్న బాలసుబ్రమణ్యం..కత్తి నరసింహా రెడ్డి మార్చి 29న పదవీ విరమణ చేయనున్నారు. అదే విధంగా మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేసారు. ప్రకాశం- నెల్లూరు -చిత్తూరు ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాసుల రెడ్డి మార్చి 29న రిటైర్ కానున్నారు. కడప- అనంతపురం- కర్నూలు ప్రస్తుత ఎమ్మెల్సీ గోపాలరెడ్డి కూడా అదే రోజున పదవీ విరమణ చేయనున్నారు. శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ నేత మాధవ్ కూడా అదే రోజున పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన తిరిగి ఎన్నికల్లో పోటీలో నిలుస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఇప్పటికే వైసీపీ- టీడీపీ తమ అభ్యర్దులను ప్రకటించాయి. ఈ ఎన్నికల్లో గెలవటం ద్వారా ఫైనల్స్ ముందు బలం చాటుకొనేందుకు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

తొమ్మది స్థానిక సంస్థల కోటా

తొమ్మది స్థానిక సంస్థల కోటా

వీటితో పాటుగా తొమ్మది స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ తొమ్మది సీట్లు టీడీపీ నేతలకు చెందినవే. అయితే, స్థానిక సంస్థల కోటా కావటంతో తొమ్మది సీట్లు వైసీపీకే దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. కానీ, ఇప్పుడు అధికార వైసీపీతో పాటుగా టీడీపీ, బీజేపీ కూడా గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల పైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాయి. అదే సమయంలో బీజేపీ ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ సీటలో బరిలో ఉంది. అక్కడ ఇప్పుడు జనసేన ఎవరికి మద్దతుగా నిలుస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. మార్చి 13న పోలింగ్... 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఫలితాలు దాదాపుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రజా మూడ్ ను స్పష్టం చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు సెమీస్ గా మారుతున్న ఈ ఉప ఎన్నికల పైన ఆసక్తి పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+