అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ: నాలుగు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో జరిగే సాధారణ, ఉపఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. గురువారం చివరి రోజు కావడంతో నాలుగు స్ధానాలకు నలుగురు అభ్యర్ధులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు.

నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు ముగిశాక వీరి ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. గురువారం తెలుగుదేశం పార్టీ అభ్యర్దులు ఎంఏ షరీఫ్, కావలి ప్రతిభా భారతి, బీజేపీ నుంచి సోము వీర్రాజు నామినేషన్ వేశారు.

వీరు రెండేసి సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇక వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డీసీ గోవింద రెడ్డి బుధవారమే నామినేషన్ దాఖలు చేశారు. షరీఫ్, వీర్రాజు సాధారణ కోటా కింద నామినేషన్ వేయగా, ప్రతిభా భారతి మాత్రం పాలడుగు వెంకట్రావు మృతితో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం దాకా గడువుంది. అయితే నాలుగు స్ధానాలకు నలుగురు అభ్యర్దులు మాత్రమే నామినేషన్ వేయడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సోమవారం ప్రకటించనున్నారు.

 నాలుగు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే

నాలుగు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే


ఏపీ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో జరిగే సాధారణ, ఉపఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. గురువారం చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేసిన బీజేపీ అభ్యర్ధి సోము వీర్రాజు. పక్కనే మంత్రి మాణిక్యాలరావు.

నాలుగు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే

నాలుగు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే


ఏపీ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో జరిగే సాధారణ, ఉపఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. గురువారం చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేసిన బీజేపీ అభ్యర్ధి సోము వీర్రాజు.

నాలుగు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే

నాలుగు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే


ఏపీ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో జరిగే సాధారణ, ఉపఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. గురువారం చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ఎంఏ షరీఫ్.

నాలుగు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే

నాలుగు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే


ఏపీ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో జరిగే సాధారణ, ఉపఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. గురువారం చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ఎంఏ షరీఫ్. పక్కనే మంత్రి అచ్చెం నాయుడు.

నాలుగు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే

నాలుగు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే


పాలడుగు వెంకట్రావు మృతితో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు పేరును తొలుత తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. అయితే ఏపీలో ఓటరుగా నమోదు కాకపోవడంతో ఆయనకు అది మైనస్‌గా మారింది.

నాలుగు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే

నాలుగు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే


ఏపీలో ఓటరుగా నమోదు కాని వారు పోటీ చేయడానికి వీల్లేదు. దీంతో చివరి నిమిషంలో ఆయన స్ధానంలో ప్రతిభా భారతి పేరు ఖరారు చేశారు. అభ్యర్ధుల నామినేషన్ల పరిశీలన శుక్రవారం జరుగుతుంది.

English summary
AP MLC Nominations completed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X