'ఐఏఎస్ అయ్యి మీకే రిపోర్ట్ చేస్తా':సీఎం చంద్రబాబు మనసు గెలిచిన సాత్విక్..!!

ఆంధ్రప్రదేశ్‌లోని తల్లిదండ్రుల ముఖాల్లో అలానే విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోంది. ఇందుకు కారణం నిన్న ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చదువుకునే ప్రతీ విద్యార్థి తల్లిదండ్రుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు పడటమే.అది కూడా కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి తల్లికి వందనం నిధులు పడటంతో తల్లిదండ్రుల ఆనందం ఆకాశాన్నంటింది.

ఇక ప్రభుత్వ పాఠశాలలపై అక్కడి విద్యావిధానంపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన విద్యాశాఖ మంత్రి లోకేష్...ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దే బాధ్యతను స్వయంగా తీసుకున్నారు. ఇక తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం... జూలై 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించింది. రంపచోడవరంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా పాల్గొన్నారు. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో విద్యార్థులు మాట్లాడారు.

ap-parents-teachers-meeting-highlights-student-satvik-impresses-cm-chandrababu-with-ias-dream

పేరెంట్స్ టీచర్స్ మీటింగ్

రంపచోడవరంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. వేదికపై సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌లతో పాటు ఇతర అధికారులు ఆశీనులయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను మాట్లాడాల్సిందిగా చంద్రబాబు కోరడంతో... విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. భవిష్యత్తులో లక్ష్యాలు ఏంటో చాలా స్పష్టతతో కలిగి ఉన్న విద్యార్థులను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. ఈ వేదికపై నుంచి మాట్లాడిన విద్యార్థి సాత్విక్ సీఎం మనసును గెలిచారు. సాత్విక్ మాట్లాడిన మాటలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సైతం ఆశ్చర్యపోయారు.

మీకే రిపోర్టింగ్ చేస్తా సర్

పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన సాత్విక్ తన లక్ష్యం ఐఏఎస్ కావాలని చెప్పడంతో అక్కడి సభాప్రాంగణం చప్పట్లతో మారుమోగిపోయింది. అంతేకాదు.. ఐఏఎస్ అయ్యాక సీఎం చంద్రబాబుకు నేరుగా రిపోర్టింగ్ చేస్తానని చెప్పడంతో అక్కడి వారంతా విద్యార్థి మాటలకు ఆశ్చర్యపోయారు.ఇక డ్రగ్స్ పై మాట్లాడిన సాత్విక్.. డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని సూచించారు. తల్లితండ్రులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటే బాగుంటారని చెప్పుకొచ్చాడు. తల్లిదండ్రులు బాగుంటేనే పిల్లలు బాగుంటారని ఆనందంగా ఉంటారని, కుటుంబం సంతోషంగా ఉంటుందని చెప్పడంతో అక్కడి వారంతా చప్పట్లు కొట్టి సాత్విక్‌ను అభినందించారు.

సాత్విక్‌న ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు

సాత్విక్‌ మాట్లాడటం ముగించాక సీఎం చంద్రబాబు స్వయంగా దగ్గరకు తీసుకుని పక్కన కూర్చొబెట్టుకుని అభినందించారు. విద్యార్థి సాత్విక్ సంకల్పం తప్పకుండా నెరవేరుతుందని చంద్రబాబు ఆశీర్వదించారు. పిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సూచించారు. వారితో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అయితేనే వారి సమస్యలు తెలుస్తాయని సీఎం అన్నారు.డేర్ టు డ్రీమ్.. స్ట్రైవ్ టు అచీవ్ అని తాను ఎప్పుడూ చెబుతుంటానని చంద్రబాబు గుర్తుచేశారు.

పోలవరం నుంచి ప్రపంచానికి సేవలందించే దిశగా విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో వెనకడుగు వేయబోదని హామీ ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖ రూపొందించిన డ్రగ్స్ వద్దు బ్రో హ్యాండ్‌బుక్‌ను సీఎం ఆవిష్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+