ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు కీలక చర్చలు - టీడీపీకి కొత్త పదవులు..!!

ఢిల్లీ కేంద్రంగా కీలక మంత్రాంగాలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల వేళ ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. పీఎం మోదీతోనూ సమావేశం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటుగా రాజకీయ చర్చలు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనతో పాటుగా గవర్నర్ పదవుల భర్తీ వేళ టీడీపీకి అవకాశం దక్కనుంది. ఈ పర్యటన వేళ వీటి పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు(బుధవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మోదీ షెడ్యూల్ ఖరారు కావటంతో.. అధికారికంగా ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఆర్దిక, వాణిజ్య, వ్యవసాయ, ఇరిగేషన్ శాఖ మంత్రులతోనూ చంద్రబాబు వరుసగా భేటీ కానున్నారు. అదే విధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోనూ చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్రం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల వేళ కీలక బిల్లులను ప్రతిపాదించేందుకు సిద్దం అవుతోంది. మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ బిల్లులకు ఆమోదం పొందే విధంగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

cm-chandra-babu-to-meet-central-ministers-in-his-delhi-visit-amid-central-to-submit-key-bills-in-par

ఢిల్లీలో కీలక మంత్రాంగం.. కొత్త నిర్ణయాలు

కాగా, కీలక బిల్లుల ఆమోదంతో పాటుగా కేంద్ర కేబినెట్ ప్రక్షాళన.. కొత్తగా గవర్నర్ పదవుల భర్తీ.. కేంద్రంలో నామినేటెడ్ పదవుల నియామకం పైనా కసరత్తు జరుగుతోంది. కేంద్ర కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ నుంచి ఎవరికి కొత్తగా అవకాశం ఇవ్వాలనే దాని పైన సీఎం చంద్రబాబు నిర్ణయం కీలకం కానుంది. అదే విధంగా లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి సైతం టీడీపీకి ఇస్తారని భావిస్తున్నారు. దీంతో.. సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రి పదవి టీడీపీ లేదా జనసేనకు.. అదే విధంగా డిప్యూటీ స్పీకర్ పదవి దక్కితే టీడీపీ నుంచి ఎస్సీ ఎంపీకి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కాగా.. టీడీపీకి మరో గవర్నర్ పదవి సైతం కేటాయిస్తారని సమాచారం. ఈ పదవి బీసీ నేతకు ఇస్తారని భావిస్తున్నారు. దీంతో.. ఈ సారి ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు చర్చలు.. నిర్ణయాలు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+