వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బిజెపికి గుడ్‌బై చెప్పండి, కలిసే పోరాటం' 'బాబుపై కేసులతోనే రాష్ట్రానికి నష్టం'

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీకి న్యాయం జరగాలంటే రాజీనామా చేసి రావాలని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి టిడిపికి సూచించారు. రాజీనామా చేసి వస్తే కలిసి ఏపీకి న్యాయం జరిగేలా ఉద్యమిద్దామని రఘువీరారెడ్డి కోరారు.

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నాడు ఎన్టీఆర్ నిలిపితే తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చంద్రబాబునాయుడు కేంద్రానికి తాకట్టు పెట్టారని కాంగ్రెస్ పార్టీ నేత సి. రామచంద్రయ్య విమర్శించారు.

Recommended Video

పవన్ దెబ్బకు దిగొచ్చిన మోడీ? బీజేపీతో తెంచుకుందామని బాబు !

బడ్జెట్‌లో ఏపీకి ఎలాంటి నిధులు లేకపోయినా ప్రభుత్వం పట్టీ పట్టనట్టు వ్యవహరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి టిడిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు తాకట్టు పెడుతోందని విపక్షాలు విమర్శలు గుప్పించాయి.

కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్న బిజెపితో టిడిపి తెగతెంపులు చేసుకోవాలని విపక్షాలు బాబును డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కంటే చంద్రబాబుకు స్వంత ప్రయోజనాలే ఎక్కువగా మారాయని విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

జగన్, బాబు మోడీకి దాసోహమయ్యారు

జగన్, బాబు మోడీకి దాసోహమయ్యారు

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మోడీకి దాసోహమయ్యారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఒకరు కేంద్రంలో, రాష్ట్రంలోనూ బీజేపీతో అధికారాన్ని పంచుకుంటే, జగన్ షరతుల్లేని మద్దతు ప్రకటించారని రఘువీరా గుర్తు చేశారు. లోక్ సభలో 25 ఎంపీలు ఈ రాష్ట్రానికి ఉన్నారు. వారంతా వెనువెంటనే రాజీనామా చేయాలి. ఈ రాష్ట్రానికి ఆలస్యమైనా వెంటనే న్యాయం జరగాలంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రండి. అందరం కలసి ఉద్యమిద్దాం. మాకెటువంటి భేషజాలు లేవు. చట్టప్రకారం, పార్లమెంటులో ఇచ్చినటువంటి హామీలు అమలుకావాల్సిందేనని అని రఘువీరా అన్నారు.

టిడిపికి షాక్: విమర్శలకు కౌంటర్, సీట్ల పెంపుపై అమిత్‌ షా దే నిర్ణయం టిడిపికి షాక్: విమర్శలకు కౌంటర్, సీట్ల పెంపుపై అమిత్‌ షా దే నిర్ణయం

బడ్జెట్‌పై టిడిపి మొసలి కన్నీరు

బడ్జెట్‌పై టిడిపి మొసలి కన్నీరు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఏపీకి అన్యాయం జరిగిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం ఒట్టి మాటలతోనే ఇన్నాళ్లూ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసిందని బొత్స విమర్శలు గుప్పించారు.ఏపీకి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించకపోవడంపై టీడీపీ మొసలి కన్నీరు కార్చుతోందని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో కూడా ఇలాగే చేశారని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వల్ల బడ్జెట్‌లో ఏ మాత్రం లాభం కలగలేదని అన్నారు.

బిజెపితో పొత్తుపై జగన్ ఇలా: వ్యూహత్మకంగా వైసీపీ అడుగులు బిజెపితో పొత్తుపై జగన్ ఇలా: వ్యూహత్మకంగా వైసీపీ అడుగులు

కేసులతోనే బాబు చేతులు కట్టుకొన్నారు

కేసులతోనే బాబు చేతులు కట్టుకొన్నారు

చంద్రబాబు చేతకానితనం ఆయనపై ఉన్న కేసులు రాష్ట్ర ప్రజలకు శాపంగా మారాయని అన్నారు. ఇంకెంతకాలం చంద్రబాబు నాటకాలు ఆడతారని సూటిగా ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ నేత సి. రామచంద్రయ్య. హక్కు ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడ కేంద్రం ఇవ్వకపోవడం దారుణమన్నారు. . చంద్రబాబు చేతకానితనం ఆయనపై ఉన్న కేసులు రాష్ట్ర ప్రజలకు శాపంగా మారాయని అన్నారు. ఇంకెంతకాలం చంద్రబాబు నాటకాలు ఆడతారని సూటిగా ప్రశ్నించారు.

పోలవరంపై కెవిపి విమర్శలు

పోలవరంపై కెవిపి విమర్శలు


రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కెవిపి రామచంద్రరావు విమర్శలు గుప్పించారు. రాజ్యసభలో బడ్జెట్ కు జరిగిన అన్యాయంపై కెవిపి ఆందోళన చేసిన తర్వాత కెవిపి మీడియాతో మాట్లాడారు,పోలవరం ప్రాజెక్టను పూర్తి చేయాలనే ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు,

English summary
Ap pcc chief Raghuveera Reddy made allegations on Ap chief minister Chandrababunaidu on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X