AP Pensions: ఏపీలో కొత్త పెన్షన్లపై క్లారిటీ-మండలిలో సర్కార్ ప్రకటన..!
ఏపీలో కొత్త పెన్షన్ల (pensions) కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం ఇవాళ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా పెన్షన్ల మొత్తం పెంపు తర్వాత రాష్ట్రంలో తిరిగి కొత్త దరఖాస్తుల్ని ప్రభుత్వం స్వీకరించడం లేదు. దీంతో గతేడాది నుంచీ పెన్షన్ల కోసం భారీ సంఖ్యలో వృద్ధులు, వితంతువులు, ఇతర వర్గాల వారూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఇవాళ ప్రభుత్వం కొత్త పెన్షన్లపై కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు.
త్వరలో కొత్త పెన్షన్లు (pensions)
రాష్ట్రంలో కొత్తగా వృద్ధాప్య పింఛన్లు, వితంతు పింఛన్లు ఇచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నట్లు శాసనమండలిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వీటి కోసం ఇప్పటికే విధివిధానాలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ ప్రారంభం కాగానే అర్హులైన వారికి దరఖాస్తు చేసే అవకాశం కల్పించనున్నారు. దీనిపై అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుందని ఆయన వెల్లడించారు.

ప్రక్రియ ఇలా
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందే పెన్షన్ల పెంపు హామీ ఇచ్చింది. అన్నట్లుగానే సూపర్ సిక్స్ లో భాగంగా వృద్ధాప్య, వితంతు పెన్షన్లను 4 వేలకు పెంచారు. అలాగే దివ్యాంగుల పెన్షన్లను 6 వేలకు పెంచారు. అనంతరం అనర్హుల ఏరివేత కోసం భారీ కసరత్తు చేశారు. దీంతో పెన్షన్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ అర్హులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం విధివిధానాలను ఖరారు చేస్తోంది. త్వరలోనే దరఖాస్తుల ప్రక్రియను సచివాలయాల ద్వారా ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications