ఏపీ ప్రజలకు శ్రీలంక ప్రజలకంటే ఓర్పు ఎక్కువ; అందుకే వైసీపీప్రభుత్వం ఇంకా ఉందన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి వరద ముంపుకు గురైన ప్రాంతాలలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఏలూరు జిల్లా నుంచి చంద్రబాబు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన ప్రారంభించి, అనేక గ్రామాల్లో పర్యటిస్తూ వరద బాధితులను పరామర్శిస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక వరద బాధితుల కష్టాలను నేరుగా చూస్తున్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ పాలన పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా ఇలపర్రు లో స్థానికులతో మాట్లాడారు.
వైసిపి మూడేళ్ల పాలనపై టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో కంటే ఏపీలో పరిస్థితి దారుణంగా మారిందని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ ప్రజలు శ్రీలంక ప్రజల కంటే ఎక్కువ ఓర్పు ఉన్నవారని చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే ఇంకా వైసిపి ప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు. ఇక వైసీపీ ప్రభుత్వం పై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు దగ్గర్లోనే ఉందని చంద్రబాబు విమర్శించారు. దేశంలోనే అధిక ధరలకు చిరునామా ఆంధ్రప్రదేశ్ అని చంద్రబాబు మండిపడ్డారు .

దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ అప్పులు చేసింది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రజల నడ్డి విరుస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ను రివర్స్ గేర్ తో వెనక్కి తీసుకు వెళుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టడం కోసం కొత్త అప్పులు చేస్తున్నారంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్రీలంకగా మారుస్తున్నారు అంటూ ఇప్పటికే అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని వ్యాఖ్యానించారు.
పట్టించుకోని పాలకులకు తగిన బుద్ధి చెప్పాలంటూ పేర్కొన్నారు. కేంద్రం పంపిస్తున్న బియ్యాన్ని వైసీపీ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయడం లేదని, నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ ప్రజలను అడుగడుగున ఇబ్బంది పెడుతోందని వైసీపీ సర్కార్ తీరుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications