breaking:జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్, శంషాబాద్‌లో అదుపులోకి, అనంతపురం తరలింపు..
గతకొంతకాలంగా రవాణాశాఖ కళ్లు గప్పుతున్నారని జేసీ ట్రావెల్స్‌పై ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ కేసులు నమోదు చేసింది. కొన్ని వాహనాలు కూడా సీజ్ చేసింది. అయితే జేసీ ట్రావెల్స్ యజమాని, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా మార్చారనే అభియోగంతో ప్రభాకర్ రెడ్డి, అతని కుమారుడు అస్మిత్ రెడ్డిని శంషాబాద్‌లోని వారి నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.

అస్మిత్ రెడ్డి కూడా
జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు అస్మిత్ రెడ్డిని శంషాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి రోడ్డుమార్గంలో అనంతపురం తరలిస్తున్నారు. నకిలీ ఇన్సూరెన్స్ వ్యవహారంలో అస్మిత్ రెడ్డి, బీఎస్-4 వాహనాలుగా మార్చడం, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి ఏఫీకి తరలించారనే అభియోగంతో ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వారిద్దరినీ ఇవాళ తాడిపత్రి కోర్టులో హాజరుపరచే అవకాశం ఉంది.

సరికాదు
జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్ట్‌ను జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీపవన్ రెడ్డి ఖండించారు. పోలీసుల ఆరోపణకు సంబంధించి విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధమని బాబాయ్ ప్రకటించారని గుర్తుచేశారు. అయినా అరెస్ట్ చేయడం ఏంటీ అని నిలదీశారు. విచారణకు సహకరిస్తానని చెప్పిన వినకుండా అదుపులోకి తీసుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. చిన్నాన్న ఆరోగ్యం కూడా సరిగా ఉండదని తెలిపారు.

వారిని ఎందుకు వదిలేశారు
ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులు వేరే ఉన్నారని పవన్ రెడ్డి తెలిపారు. తమకు మోసంగా వాహనాలు విక్రయించిన అకోశ్ లేలాంట్ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. ఇందులో మధ్యవర్తిత్వం వహించిన ముత్తును కూడా విచారించడం లేదు పేర్కొన్నారు. కానీ తమపై మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Recommended Video

4
జేసీ అండ్ కో నకిలీ పత్రాలు సృష్టించి 154 వాహనాలు నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించి ఫేక్ ఎన్‌ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్ కేసుల్లోనే అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్‌పై 24 కేసులు ఫైల్ కాగా.. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్‌పై మరో 27 కేసులు కూడా ఉన్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications