అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతిపై సుప్రీం చెప్పిందిదే ! కానీ ఎవరికి వారు సొంత భాష్యాలు! వాస్తవంగా జరిగిందిదీ !

|
Google Oneindia TeluguNews

అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దీని అమలుపై పూర్తిస్దాయి స్టే ఇవ్వాలని కోరింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్దితులు, రాజధానుల ఆవశ్యకత దృష్ట్యా విచారణ వేగంగా పూర్తి చేసి ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరింది. అయితే సుప్రీంకోర్టు తాజాగా దీనిపై విచారణ నిర్వహించి మధ్యంతర ఆదేశాలు మాత్రం ఇచ్చింది. ఇందులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగానే తాను చెప్పాలనుకున్నది చెప్పింది. అయితే దీన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా, ప్రత్యర్ధులకు ప్రతికూలంగా అన్వయించుకుంటున్నారు.

అమరావతిపై సుప్రీం ఉత్తర్వులు

అమరావతిపై సుప్రీం ఉత్తర్వులు

అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నిన్న సుప్రీంకోర్టులో తాజాగా విచారణ జరిగింది. ఇందులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా కొన్ని విషయాలపై మాత్రమే స్పందించింది. సీఆర్డీయే చట్టం చెల్లుబాటు, మూడు రాజధానుల ఏర్పాటులో ఔచిత్యం, అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోంది, రైతులకు ప్రభుత్వం ఎలా న్యాయం చేయబోతోంది వంటి అనేక అంశాలపై సుప్రీంకోర్టు స్పందించలేదు. కేవలం హైకోర్టు తన తీర్పులో రాజధాని నిర్మాణానికి విధించిన గడువులపై మాత్రమే స్టే ఇచ్చింది. మిగతా వాటిపై స్పందిస్తే ఏం జరుగుతుందో కూడా చెప్పేసింది.

 అసెంబ్లీ అధికారంపై స్టే విషయంలో ?

అసెంబ్లీ అధికారంపై స్టే విషయంలో ?

రాష్ట్ర ప్రభుత్వం అమరావతి స్దానంలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం చేసిన ప్రయత్నాలను హైకోర్టు తన తీర్పుతో అడ్డుకుంది. దీంతోపాటు రాజధానుల ఎంపిక, నిర్మాణానికి కావాల్సిన శాసనాధికారం అసెంబ్లీకి లేదని కూడా తేల్చిచెప్పింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మొగ్గుచూపలేదు. కానీ భవిష్యత్తులో స్టే ఇస్తామో లేదో కూడా చెప్పలేదు. ఇప్పుడు స్టే ఇస్తే మాత్రం వాదనలు వినకుండానే హైకోర్టు తీర్పును పక్కనబెట్టినట్టవుతుందన్న రైతుల తరఫు న్యాయవాది శ్యాం దివాన్ వాదనతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది.

 అమరావతిలో హైకోర్టుపై

అమరావతిలో హైకోర్టుపై


అమరావతిలోనే హైకోర్టు కొనసాగింపు ఉంటుందా లేదా అన్న దానిపైనా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రశ్నలు వేసింది. దీనికి సమాధానంగా వారు ప్రస్తుతానికి హైకోర్టు అమరావతిలోనే కొనసాగుతోందని, భవిష్యత్తులో అసెంబ్లీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేమని తేల్చిచెప్పేశారు. అయితే ఇదే ప్రశ్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదే పదే వేసినా రాష్ట్రపతి ఉత్తర్వుల కారణంగా ప్రస్తుతానికి హైకోర్టును న్యాయరాజధానికి తరలించే పరిస్దితి లేదని మాత్రమే లాయర్లు బదులిచ్చారు. దీంతో ఈ వ్యవహారంలో ఇంతకుమించి సుప్రీంకోర్టు స్పందించడానికి కూడా ఏమీ లేకుండా పోయింది.

 హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ప్రశ్నలు

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు ప్రశ్నలు

హైకోర్టు అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ ఇచ్చిన తీర్పు, దానికి అనుబంధంగా నిర్మాణాలకు పెట్టిన గడువు విషయంలో సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. హైకోర్టు చీఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లా, కార్వనిర్వాహక వ్యవస్ధలా వ్యహరించిందన్న వ్యాఖ్యలు కూడా చేసింది. అలాగే మూడు రాజధానుల చట్టాల్ని ప్రభుత్వం అసెంబ్లీలో ఉపసంహరించుకున్న తర్వాత హైకోర్టు ఇలాంటి ఆదేశాలు ఎలా ఇచ్చిందంటూ అభ్యంతరం తెలిపింది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు జారీ చేసిన మాండమస్ ఉత్తర్వులపైనా సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలకు రైతుల న్యాయవాదులు.. ప్రభుత్వం చట్టాలు లేకపోయినా తమకున్న అధికారంతో కార్యాలయాల తరలింపు చేపట్టినందుకే హైకోర్టు ఇలా మాండమస్ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.

 ఎవరికి వారే వక్రభాష్యాలు ?

ఎవరికి వారే వక్రభాష్యాలు ?

అమరావతిపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. అయితే అంతిమంగా ఇచ్చిన ఆదేశాలు ఏంటనేదే కీలకం. ఈ లెక్కన చూస్తే విచారణ సందర్భంగా విషయం తెలుసుకునేందుకు వేసిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. అలాగే పలు కీలక వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అయినా ఫైనల్ గా మాత్రం హైకోర్టు ఇచ్చిన తీర్పులో గడువులకు సంబంధించి మాత్రమే స్టే ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పులో మిగతా ఉత్తర్వులు కొనసాగుతాయి. కానీ నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత రాజకీయ పార్టీలు, వాటికి అనుకూలంగా ఉండే మీడియా ఛానళ్లలో కనిపించిన స్క్రోలింగ్స్ చూస్తే ఈ తీర్పు ఎవరికివారు అనుకూలంగా చెప్పుకునేందుకు ప్రయత్నించారు. కానీ అంతిమంగా చూస్తే సుప్రీంకోర్టు అసలు ఈ కేసు వాస్తవ విచారణలోకి వెళ్లనేలేదు. కీలక విషయాలపై వాదనలు కూడా వినలేదు. అది జరిగితే గానీ వాస్తవ ఉత్తర్వులు వెలువడే అవకాశం కూడా లేదు. ఆలోపు చెప్పుకునే వక్రభాష్యాలకు కూడా విలువలేదు.

English summary
supreme court's interim order on amaravati capital yesterday gives clear indications but ap political parties using the orders in their favor only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X