టీడీపీ పై బీజేపీ హైకమాండ్ నయా స్కెచ్ - అసలు లక్ష్యం ఇదే..!!
ఏపీలో బీజేపీ రాజకీయంగా కొత్త స్కెచ్ సిద్దం చేసుకుంది. ఏపీలో బీజేపీ ఎదగకపోవటం పైన తాజాగా విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అయిన స్థాయిన ఏపీలో ఎందుకు కావటం లేదని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఏపీ బీజేపీకి పూర్తి స్థాయిలో కొత్త ఇంఛార్జ్ ను నియమిస్తామని వెల్లడించారు. ఇక, ఢిల్లీ నేతలకు ఏపీలో పార్టీ పరిస్థితి పైన పూర్తి క్లారిటీ వచ్చిందని ఢిల్లీ నేతలతో సత్సంబందాలు కొనసాగించే ఏపీకి చెందిన ముఖ్య నేత విశ్లేషించారు.
ప్రధాని మోదీ పర్యటనతో మార్పు
ఏపీలో వచ్చే ఎన్నికలను బీజేపీ అధినాయకత్వం కీలకంగా భావిస్తోంది. మరో పది నెలల్లో జరిగే తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనేది బీజేపీ లక్ష్యం. అక్కడ అధికార టీఆర్ఎస్ తో బీజేపీ హోరా హోరీగా పోరాటం చేస్తోంది. తెలంగాణ ఎన్నికలు జరిగిన ఆరు నెలల తరువాత ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలా.. కలిసొచ్చే పార్టీలతో పొత్తు కుదుర్చుకోవాలనే అనే మీమాసంలో బీజేపీ ఉంది. టీఆర్ఎస్ ఇప్పటికే వామపక్షాలతో వచ్చే ఎన్నికల్లోనూ పొత్తు ఉంటుందనే స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. అక్కడ టీడీపీతో పొత్తు ఉంటుందా అనే అంశం ఆధారంలో ఏపీలో నిర్ణయం ఉండే ఛాన్స్ ఉందని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు.

పవన్ కల్యాణ్ తో కలిసే ముందుకు
ఇటు ఏపీలో ఇప్పటికైనా పార్టీ బలోపేతం పైన ఫోకస్ చేయాలని పార్టీ అధినాయకత్వం స్పష్టంగా చెబుతోంది. ఈ క్రమంలో టీడీపీ -బీజేపీ ఓట్ బ్యాంక్ దాదాపు ఒకే రకమైనది కావటంతో, టీడీపీ బలంగా ఉన్నంత వరకు ఏపీలో బీజేపీ బలం పెంచుకోవటం సాధ్యం కానది కమలం నేతలు స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగానే...తమ మిత్రపక్షం జనసేన తో కలిసి ఎన్నికలకు వెళ్లాలనేది బీజేపీ వ్యూహంగా పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీతో గతంలో కలవటం..విడిపోవటం కారణంగా పార్టీకి పొత్తుల వేళ సీట్లు మినహా.. పార్టీ పరంగా బలం పెంచుకోలేకపోయిందని కమలం పార్టీ నేతల అభిప్రాయం. దీంతో, టీడీపీ అధికారంలోకి రావటానికి సహకరించటం మినహా.. పార్టీ పరంగా సొంతగా బలం పెంచుకొనే అవకాశాలు ఉండవని ఢిల్లీ పెద్దల అభిప్రాయంగా పార్టీ నేతలు వివరిస్తున్నారు.

టీడీపీ తో పార్టీకి లాభమా - నష్టమా
అయితే, ఏపీలో ఏ పార్టీలో అధికారంలోకి వచ్చినా తమకు అనుకూలంగా ఉంటున్న పరిస్థితుల్లో ఆచి తూచి వ్యవహరించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగా.. టీడీపీ ప్రస్తుత బలహీనతలను బలంగా మార్చుకొనే వ్యూహంలో బీజేపీ ఉందని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ప్రధానితో భేటీ తరువాత పవన్ కల్యాణ్ పీఎంను ఉద్దేశించి ట్వీట్లు చేస్తూ ప్రశంసలతో ముంచెత్తారు. దీని ద్వారా..బీజేపీ - జనసేన బంధానికి ఇబ్బందులు లేవని భావిస్తున్నారు. ఇక, టీడీపీతో బీజేపీ అధినాయకత్వం ప్రస్తుతం ఉన్న విధానంలోనే కొనసాగుతుందా..లేక, మార్పుతో ముందుకు వస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications