జగన్ చేతికి చంద్రబాబు - పవన్ గెలుపు అస్త్రం..!?
ఏపీలో పొత్తు రాజకీయం మొదలైంది. సీఎం జగన్ టార్గెట్ గా ప్రతిపక్ష పార్టీలు ఏకం అవుతున్నాయి. టీడీపీ - జనసేన పొత్తు లాంఛనమే. ఇటు సీఎం జగన్ వై నాట్ 175 నినాదంతో ధీమాగా ఉన్నారు. వచ్చే ఎన్నికలు పెత్తందార్లు వర్సస్ పేదవారిగా చెప్పుకొచ్చారు. 88 శాతం మందికి అందిస్తున్న సంక్షేమమే జగన్ ఆయుధంగా మారుతోంది. టీడీపీ - జనసేన పొత్తు వేళ ఆ రెండు పార్టీల అధినేతలు చేస్తున్న వ్యాఖ్యలు జగన్ కు వరంగా మారుతున్నాయి. జగన్ ప్రజా బలం.. గెలుపు అవకాశాల పై వైసీపీ కంటే ఈ ఇద్దరు ముఖ్య నేతలే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఇవే ఇప్పుడు జగన్ కు అస్త్రాలుగా మారుతున్నాయి.

ఒంటరిగా జగన్ ను ఎదుర్కోలేం
వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించేందుకు పొత్తులు ఖరారవుతున్నాయి. టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ బీజేపీ ఏం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. బీజేపీ తమతో కలిసి వచ్చేలా టీడీపీ - జనసేన అధినేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ మాత్రం టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటున్నాయి. ఈ రెండు పార్టీలు మరి కొంత కాలం వేచి చూసే ధోరణితో ఉన్నాయి. వైసీపీ ఈ రెండు పార్టీల పొత్తుల పైన తొలి నుంచి స్పష్టతతో ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తాయని టీడీపీ - జనసేన నేతలు చెబుతున్నా..అసలు కారణం ఒంటరిగా పోటీ చేస్తే జగన్ ను ఓడించలేమని అర్దం కావటమేనని విశ్లేషణలు మొదలయ్యాయి. ఎన్నికల కోసం వ్యూహాకర్తలను నియమించుకున్న టీడీపీ.. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నుంచి సర్వే నివేదికలను సేకరిస్తోంది. ఆ నివేదికల ఆధారంగానే పొత్తులు తప్పవనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

జగన్ పై సమిష్ఠిగా వెళ్తేనే.. యుద్దం
2014, 2019 ఎన్నికల్లో జగన్ ఒంటరిగానే పోటీ చేసారు. 2014లో ప్రతిపక్షంగా.. లో అధికారంలోకి వచ్చారు. 2014లో టీడీపీ - బీజేపీ పవన్ కలిసి పవన్ ను ఓడించేందుకు ఏకం అయ్యారు. ఆ ఎన్నికల్లో అధికార - ప్రతిపక్షాల మధ్య ఓట్ల తేడా 1.95 శాతం. వైసీపీకి 67 సీట్లు రాగా, ఈ కూటమికి 102 స్థానాలు దక్కాయి. 2019 ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేయటంతో వైసీపీకి 151 సీట్లు రాగా, టీడీపీ 23 సీట్లకు పరిమితం అయింది. వై నాట్ 175 అంటూ ధీమాగా కనిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్ తో సింగిల్ గా పోటీకి చంద్రబాబు - పవన్ సిద్దంగా లేరు. ఒంటరిగా పోటీ చేసి వీరమరణాలు అవసరం లేదంటూ పవన్ స్వయంగా చేసిన వ్యాఖ్యలతో జగన్ బలం ఏంటనేది చెప్పకనే చెప్పుకొచ్చారు. అటు చంద్రబాబు సైతం జగన్ పైన ఆరోపణలు చేస్తూనే.. అటువంటి వాళ్లకు వ్యతిరేకంగా అందరం కలవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నానితో సహా పలువురు నేతు బలమైన జగన్ ను ఓడించాలంటే అందరం కలిసి కట్టుగా పని చేయాలంటూ ముఖ్యమంత్రి ప్రజా బలం ఏంటో వాళ్లకు వాళ్లే ప్రచారం చేస్తున్నారు.

జగన్ చేతికి ప్రతిపక్షాల అస్త్రం
టీడీపీ - జనసేనకు మాత్రమే పొత్తు పరిమితం అవుతుందా బీజేపీ కలుస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ తో కలయిక ఆధారంగా ఇతర పార్టీలు ఈ ఇద్దరితో కలిసే అంశం డిసైడ్ అవుతుంది. సోనియా తో ధిక్కరించి సొంత పార్టీ ఏర్పాటు చేసిన సమయం నుంచి ప్రజల పైన నమ్మకమే తన ధైర్యం అని చెబుతూ జగన్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేసారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామలను అమలు చేయకపోవటం పైన 2019లో జగన్ ప్రధానంగా ప్రచారం చేసి టీడీపీ అధినేత విశ్వసనీయత దెబ్బ కొట్టారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత తాను ఇచ్చిన హామీల్లో 95 అమలు చేసి తన క్రెడిబులిటీ పెంచుకొనే ప్రయత్నం చేసారు. టీడీపీ హామీల విస్మరణలో ప్రశ్నించని పవన్..ఇప్పుడు జగన్ ను ఓడించే అంశంలో తిరిగి చంద్రబాబుకు మద్దతుగా నిలవటం వైసీపీకి అస్త్రం గా మారుతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. చంద్రబాబు - పవన్ పొత్తుతోనే ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ జగన్ బలం వారితోనే స్పష్టమవుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications