Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో పార్టీ ఏర్పాటుపై షర్మిల క్లారిటీ- అన్న పైన పోటీ తప్పదా : జగన్ మేనియా కు చెక్ పెట్టగలరా..!!

రోజు రోజుకీ మారుతున్న ఏపీ రాజకీయాల్లో మరో సంచనలం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో తన అన్నకు ఇష్టం లేకపోయినా పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నా రనే ప్రచారం సాగుతోంది. తెలంగాణలో అనుకున్న స్థాయిలో రాజకీయంగా రాణించలేకపోతున్న వేళ..షర్మిల తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అన్న జగన్ తో బేదాభిప్రాయాలతో షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసారు. తెలంగాణలో తాను పార్టీ ఏర్పాటు చేయటం అన్నకు ఇష్టం లేదని షర్మిల పలు మార్లు స్వయంగా చెప్పారు.

Recommended Video

    2021 Year Ender: Telugu States లో వీళ్ళు మస్త్ ఫేమస్ గురూ | Top Names | Oneindia Telugu
    అన్న వద్దన్నా తెలంగాణలో ముందుకే

    అన్న వద్దన్నా తెలంగాణలో ముందుకే

    పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం సరి కాదని జగన్ సైతం చెప్పినట్లుగా ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల ఓపెన్ గానే చెప్పారు. అయితే, కొద్ది రోజులుగా కుటుంబ వ్యవహారాలు.. వైఎస్సార్ జన్మదినం- వర్దంతి కార్యక్రమాల్లో నాడు కలిసి పాల్గొన్న అన్నా - చెల్లి ఇప్పుడు వేర్వేరుగా హాజరవుతున్నారు. ప్రతీ ఏటా కలిసి చేసుకొనే క్రిస్మస్ వేడుకలకు షర్మిల పులివెందులకు దూరంగా ఉంటున్నారు. ఇక, తాజాగా ఇద్దరి మధ్య దూరంగా పెరుగుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

    ఏపీలో పార్టీ పెట్టకూడదని రూల్ లేదుగా

    ఏపీలో పార్టీ పెట్టకూడదని రూల్ లేదుగా

    తెలంగాణలో పాదయాత్ర ప్రారంభించి..ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మధ్యలో బ్రేక్ ఇచ్చిన షర్మిల..ఇప్పుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసారు. తననకు కలిసిన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించిన షర్మిల...ఆసక్తి కర అంశాలపైన స్పందించారు. అందులో భాగంగా.. ఏపీలో పార్టీ పెడుతున్నారా అని అడిగిన అంశం పై స్పందించిన షర్మిల.. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టొచ్చు..పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా అని చెప్పటం ద్వారా భవిష్యత్ లో తన లక్ష్యం ఏంటో చెప్పకనే చెప్పేసారు. ఎక్కడా ఏపీలో పార్టీ పెట్టటం లేదనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. దీని ద్వారా షర్మిల ఏపీలో పార్టీ ఏర్పాటు అంశాన్ని మాత్రం తోసి పుచ్చకపోవటం కొత్త సమీరణాలకు కారణమవుతోంది.

    అన్నకు పోటీగా సిద్దమయ్యారా

    అన్నకు పోటీగా సిద్దమయ్యారా

    ఏపీలో అన్నకు పోటీగా షర్మిల పోటీ పెట్టే పరిస్థితి ఉందా.. పార్టీ ఏర్పాటు చేసినా నిలబడగలరా అనేది ఇప్పుడు మరో చర్చ. ఏపీలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో షర్మిల నిజంగా పార్టీ ఏర్పాటుకు ముందుకు వస్తే అది ఆంధ్ర రాజకీయాల్లో సంచలనంగా మారనుంది. తెలంగాణలో పార్టీ ఏర్పాటు తరువాత షర్మిల అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్లలేకపోతున్నారనే అభిప్రాయం ఉంది. అయితే, జగన్ జైల్లో ఉన్న సమయంలో.. 2019 ఎన్నికల సమయంలోనూ జగన్ గెలుపు కోసం ప్రచారం చేసారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటు సమయంలో ఏపీలో జగన్ తన పని తాను చేసుకుంటారు... తెలంగాణలో తన పార్టీ తాను చూసుకుంటానంటూ వ్యాఖ్యానించారు.

    తెలంగాణలో కొనసాగుతారా.. ఏపీలో ఎంట్రీ ఇస్తారా

    తెలంగాణలో కొనసాగుతారా.. ఏపీలో ఎంట్రీ ఇస్తారా

    కానీ, మారుతున్న సమీకరణా లతో ఇప్పుడు షర్మిల ఏ నిర్ణయం తీసుకుంటారనేది తాజా వ్యాఖ్యలతో మరింత ఆసక్తి కరంగా మారింది. షర్మిల తన అభిప్రాయాలను వెల్లడిస్తూనే.. తాము ఒక మార్గాన్ని ఎంచుకున్నామని చెప్పుకొచ్చారు. ఇక, ఈ నెల 19 లేదా 20 నుంచి పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాల గొంతు నొక్కెందుకే నిబంధనలు తీసుకొస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ కేసీఆర్ దొందు దొందే అంటూ ఆరోపించారు. ఇష్యూ డైవర్ట్ చేసేందుకు బీజేపీనీ కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు.

    జగన్ మేనియాను తట్టుకోగలరా

    జగన్ మేనియాను తట్టుకోగలరా


    ఇక, ఇప్పుడు షర్మిల తెలంగాణ లో కొనసాగుతారా.. ఏపీలోకి ఎంట్రీ ఇస్తారా అనేది మరి కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, షర్మిల వ్యాఖ్యలను లోతుగా అధ్యయనం చేసిన వారు మాత్రం ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటు పైన షర్మిల ముందడుగు వేసే అవకాశం ఉందనే చెబుతున్నారు. అయితే, అప్పుడు తెలంగాణలో పార్టీ మనుగడ కష్టంగా మారనుంది. రెండు రాష్ట్రాల్లోనూ దెబ్బ తినే అవకాశాలు లేకపోలేదనే విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో..షర్మిల స్పష్టంగా తన వైఖరి ప్రకటించిన తరువాతనే ఈ మొత్తం వ్యవహారం పైన క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+