AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం-రేపు ఈ జిల్లాల్లో వర్షాలు..!
ఎల్ నినో కారణంగా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న ఏపీ ప్రజలకు మరో శుభవార్త. ఇప్పటికే ద్రోణి ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. రేపు ఏర్పడే ఈ అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు ( AP rain Alert) కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్ద ప్రకటించింది. రానున్న మూడు రోజుల పాటు ఇవి కొనసాగుతాయని కూడా వెల్లడించింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. ముఖ్యంగా ఈదురుగాలులతో వర్షం పడే సమయంలో చెట్లు క్రింద, భారీ హోర్డింగ్స్ వంటి వాటి వద్ద నిలబడరాదని కోరింది.

గురువారం శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే శుక్రవారం మేఘావృతమైన వాతావరణంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడతాయి. అలాగే శనివారం విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
