AP Rains: బలపడుతున్న వాయుగుండం- ఏపీలో రేపటి నుంచి మళ్లీ వర్షాలు..!

అర్నబ్ తుఫాన్ ధాటికి కకావికలమైన ఆంధ్రప్రదేశ్ కోలుకోక ముందే మరో ముప్పు తరుముకొస్తోంది. అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న నికోబార్ దీవులపై కేంద్రీకృతమైన అల్పపీడనం రేపు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. తర్వాత 2 రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు (AP Rains) కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.

తీవ్ర వాయుగుండంగా అర్నాబ్..! రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ..!
తీవ్ర వాయుగుండంగా అర్నాబ్..! రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ..!

తాజా అంచనాల ప్రకారం రేపు మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఆదివారం కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

AP Rains Moderate Showers likey in Andhra Rayalaseema as Low-Pressure System Strengthens
AP Weather: మరో అల్పపీడనం- ఈ జిల్లాల్లో 4 రోజులు వర్ష సూచన..!
AP Weather: మరో అల్పపీడనం- ఈ జిల్లాల్లో 4 రోజులు వర్ష సూచన..!

సోమవారం కూడా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మరోవైపు ఇవాళ సాయంత్రం 6 గంటల నాటికి కోనసీమ జిల్లా నగరంలో 91.5మిమీ, పశ్చిమగోదావరి తణుకులో 81.2మిమీ, అనకాపల్లి జిల్లా చోడవరంలో 80.2మిమీ, కాకినాడ జిల్లా వేలంగిలో 76.9మిమీ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 76.7మిమీ, కోనసీమ జిల్లా మామిడికుదురులో 54.2మిమీ, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 52.5 మిమీ చొప్పన వర్షపాతం నమోదైందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+