హైద్రాబాద్ ఎఫెక్ట్: రెవెన్యూలో బెజవాడ 'డబుల్', దేశంలో ఏపీ టాప్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాణిజ్య పన్నుల ద్వారా రూ.8,250 కోట్లు వచ్చాయి. ఇది రికార్డ్. ఈ మొత్తం దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక వృద్ధి రేటు. సిగరేట్, లిక్కర్ తదితరాల ధరలు పెరిగిన నేపథ్యంలో వాటి ద్వారా 23.63 శాతం పెరుగుదల కనిపించింది.

ఇటీవల ముగిసిన జూన్ త్రైమాసిక ముగింపులో అన్ని రెవెన్యూ విభాగాలలో అత్యధిక వృద్ధి రేటు కనిపించింది. సిగరేట్, లిక్కర్ ద్వారా వచ్చే ట్యాక్స్ మొత్తం జాతీయ సగటు కంటే ఏపీలోనే ఎక్కువగా ఉంది. తొలి త్రైమాసికంలో కమర్షియల్ ట్యాక్స్ ద్వారా మంచి రెవెన్యూ వచ్చింది. దాదాపు 24 శాతం పెరుగుదల ఉంది.

సిగరేట్ల పైన ట్యాక్స్ ద్వారా రూ.173 కోట్లు, లిక్కర్ పైన రూ.2,040 కోట్లు, పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా రూ.2,208.83 కోట్లు, ఇతర పిఎస్‌యుల ద్వారా రూ.41.40 కోట్ల రెవెన్యూ వచ్చింది. వ్యాట్, సీఎస్టీ ద్వారా రూ.7,812.70 కోట్లు, ఇతర ట్యాక్సుల ద్వారా రూ.437.3 కోట్లు వచ్చాయి.

 AP records 23.63 per cent growth in commercial tax

రెవెన్యూలో ఏపీలో విజయవాడ ఈ రూ.999.96 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ మూడు నెలల్లో అంత మొత్తం వచ్చింది. రాజధాని అమరావతి అయిన నేపథ్యంలో విజయవాడను రెండు ట్యాక్స్ డివిజన్లుగా మార్చారు. ఒకటి విజయవాడ వన్, రెండు విజయవాడ టూ.

విజయవాడ రెండు డివిజన్లు కలిపి రూ.1,297.31 కోట్లు, ఆ తర్వాత విశాఖపట్నం 430.56 కోట్లు, కర్నూలు రూ.247 కోట్లుగా ఉంది. ఏపీ కార్యాలయాలు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో రెవెన్యూ రెండింతల కంటే ఎక్కువైంది. గతంలో రూ.600 కోట్లుగా బెజవాడలో ఉండేద. ఇప్పుడు రూ.పన్నెండు వందల కోట్లు దాటింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Andhra Pradesh government has earned a revenue of Rs 8,250 crore from commercial taxes, the highest increase in any state in the country.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X