ఏపీ కరోనా అప్‌డేట్‌- 7855 కేసులు-52 మృతులు-గోదావరి జిల్లాలో సేమ్‌ సీన్‌

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కల్లోలం రేపుతూనే ఉంది. పట్టణ ప్రాంతాల్లో కాస్త పరిస్ధితులు కుదుటపడుతున్నా గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న కేసులతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా ప్రభావం కనిపిస్తూనే ఉంది. తాజాగా ఇవాళ ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ బులిటెన్‌లోనూ కరోనా కేసుల సంఖ్య పెరిగినట్లే కనిపిస్తోంది. అటు మృతుల సంఖ్య కూడా నిలకడగా కొనసాగుతోంది.

ఏపీలో గత 24 గంటల్లో మొత్తం 7855 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎప్పటిలాగే తూర్పుగోదావరి జిల్లా 1095 కేసులతో అగ్రభాగాన నిలిచింది. 325 కేసులతో కర్నూలు జిల్లా ఈ జాబితాలో చివరి స్ధానంలో నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా 992, ప్రకాశం 927, చిత్తూరు 902 కేసులతో టాప్‌ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో ఉన్నాయి. మరోవైపు కృష్ణా 346, విజయనగరం 384, నెల్లూరు 405, విశాఖ 425, శ్రీకాకుళం 461, అనంతపురం 497 చివరి నుంచి అత్యల్ప కేసుల జాబితాలో ఉన్నాయి. ఇవాళ నమోదైన కేసులతో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో 6.54 లక్షల కేసులు నమోదు కాగా.. 5.79 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 69 వేల యాక్టివ్‌ కేసులున్నాయి.

ap records 7855 new covid 19 cases and 52 deaths in last 24 hours

మృతుల సంఖ్య చూస్తే చిత్తూరులో 8, అనంతపూర్‌లో 6, గుంటూరులో 6, కృష్ణాలో 5, ప్రకాశంలో 5, విశాఖలో 5, తూర్పుగోదావరిలో 4, కడపలో 3, కర్నూల్లో 3, పశ్చిమగోదావరిలో 3, విజయనగరంలో 2, నెల్లూరులో 1, శ్రీకాకుళంలో 1 మరణం చోటు చేసుకున్నాయి. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో మృతుల సంఖ్య 5558కి చేరింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా నిర్ధారణకు 76 వేల పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం హెల్త్‌ బులిటెన్‌లో ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+