కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో కొత్తగా 7948 కరోనా కేసులు, 58 మంది మృతి... హాట్ స్పాట్లుగా తూర్పుగోదావరి, కర్నూలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి దారుణంగా ఉన్నట్లు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ సూచిస్తోంది. గత 24 గంటల్లోనే అన్ని జిల్లాలు కలిపి 7948 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే 58 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 62979 శాంపిల్స్ ను పరీక్షించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 కరోనా వంకతో నచ్చని సిలబస్ కోత - సీబీఎస్ఈ బాటలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కరోనా వంకతో నచ్చని సిలబస్ కోత - సీబీఎస్ఈ బాటలో బీజేపీ పాలిత రాష్ట్రాలు

ఏపీలో కరోనా విజృంభణ తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉంది. ఈ రెండు జిల్లాలో సగటున రోజుకు కనీసం వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో తూర్పుగోదావరి అత్యధికంగా 1367 కొత్త కేసులు నమోదు చేయగా... కర్నూల్లో 1146 కేసులు వచ్చి పడ్డాయి. వీటి తర్వాత గుంటూరు జిల్లాలో 945 కొత్త కేసులు వచ్చాయి. దీంతో అక్కడ కూడా వైరస్ వ్యాప్తి అధికంగా ఉున్నట్లు తేలింది. తాజా కేసులతో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 10వేలు దాటిపోయింది. వీటిలో డిశ్చార్జ్ అయిన 52 వేల మందిన తీసేస్తే మరో 56 వేల మంది చికిత్స పొందుతున్నారు.

ap records 7948 covid 19 cases, 58 deaths in last 24 hours

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కరోనా మృత్యుహేళి కూడా కొనసాగుతోంది. గత 24 గంటల్లో మొత్తం 58 మంది కరోనా కారణంగా చనిపోయారు. వీరిలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 11 మంది చనిపోగా.... కర్నూల్లో పది మంది, విశాఖలో తొమ్మిది మంది, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, కృష్ణా, నెల్లూరు, విజయనగరంలో నలుగురేసి, అనంతపురంలో ముగ్గురు, కడప, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చనిపోయారు.

English summary
andhra pradesh records 7948 new covid 19 positive cases and 58 deaths in last 24 hours. east godavari and kurnool districts become covid 19 hotspots with more than 1000 cases each.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X